‘దొరసాని’ హిట్!!

 

గడప దాటిన ఆడది దాసి అయినా ‘దొరసాని’ అయినా
అది ప్రపంచాన్ని ధిక్కరించడం కాదు…
తమకూ ఒక ప్రపంచం ఉంటుంది అని చాటడం..
ప్రేమలో పడటం ఎప్పటికీ సులువే.దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాలు.కులాల్ని దాటి , మతాలని దాటి ఆస్తులని దాటి, అంతస్తులని దాటి
హోదాలని దాటి, పలుకుబడులను దాటి
అహంకారాలని దాటి, కుట్రలను దాటి
చేసే ప్రయాణం ఎప్పుడూ సులువు కాదు.మనసులు ఎగరేసిన జెండా రెపరెపల హోరులో
వయసు వలవేసిన ప్రేమనే పోరులో చివరి గెలుపు సంతకం చేసేదెప్పుడూ కాలమే
అని చాటి చెప్తుంది ఈ దొరసాని.ఉచ్చ పోసుకోడానికి కూడా
తీరికలేని మన బిజీ బ్రతుకుల్లో
పక్కోడి జీవితమెప్పుడూ మెల్లగా కదులుతున్నట్టే అనిపిస్తుంది.పక్కోడి ప్రేమ కథ ఎప్పుడూ
సుఖంగానే ఉన్నట్టు కనిపిస్తుంది.ఒక అనుభూతి కోసం, ఒక అనుభవం కోసం దొరసానిని చూసొచ్చేయండి.