‘ఎలక్షన్ మిషన్ 2019’. ఈవీఎంలపై త్వరలో ఈ.సి.తో 22 పార్టీల భేటీ! – చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.

‘ఎలక్షన్ మిషన్ 2019’.
ఈవీఎంలపై త్వరలో ఈ.సి.తో 22 పార్టీల భేటీ!

– చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.

CBN Teleconference

అమరావతి:

ఈవిఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు వెల్లడవుతున్నందున జాతీయస్థాయిలో చర్చిస్తున్నట్టు ఏపి. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ పార్టీ నాయకులతో మంగళవారం టెలికాన్ఫరెన్సు జరిపారు.22పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసిని కలుస్తామని ఆయన చెప్పారు.
120 దేశాల్లో ఈవిఎంలను అమలు చేయడం లేదని, కేవలం 20దేశాల్లోనే ఈవిఎంల వినియోగం ఉందన్నారు.సాంకేతికతను టిడిపినే ప్రోత్సహించిందని, అయితే దుర్వినియోగానికి టెక్నాలజిలో ప్రమాదం ఉందని హెచ్చరించారు.. ఈవిఎంలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈవిఎంలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండకూడదని, సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకమని చంద్రబాబు అన్నారు. టిడిపి పోరాటం వల్లే వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయని గుర్తు చేశారు. కేబినెట్ లో
తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు
వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.
“10% రిజర్వేషన్లలో 5% ఎప్పుడో కేంద్రానికి పంపించాం. కాపులకు 5% ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రంలో బిజెపి నేతలు ఒప్పుకోలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన 10%లో కాపులకు 5% గతంలోనే ఇచ్చాం. మిగిలిన 5% ఇతర ఈడబ్ల్యుఎస్ పేదలకు ఇస్తాం.
పెన్షన్లను రెట్టింపు చేయడాన్ని కేబినెట్ ఆమోదించింది. నాలుగేళ్లలోనే పించన్ 10రెట్లు చేశాం. దీనివల్ల 54.61లక్షల మందికి ప్రయోజనం.అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250కోట్లు ముందస్తు చెల్లింపు. చిన్న మొత్తాల పేదలకు ముందస్తుగా చెల్లిస్తాం. దీనివల్ల 6లక్షల మంది బాధితులకు సత్వర ఊరట. మిగిలినవారికి కూడా హైకోర్ట్ ఆదేశాల ప్రకారం న్యాయం.
ఆటోలపై జీవిత కాల పన్ను తీసేశాం. ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను తీసేశాం. ప్రతి ఆటో డ్రైవర్ టిడిపికి అండగా ఉండాలి, ప్రతి ట్రాక్టర్ యజమాని టిడిపికి మద్దతుగా నిలవాలి.
మంజూరు కాకుండానే ఇల్లు కట్టుకున్నవాళ్లకు న్యాయం. 2014 తరువాత లక్షా 26వేల ఇళ్లు కట్టుకున్నారు. వారందరికీ ఇంటికి రూ.60వేలు ఇస్తున్నాం. రూ.756కోట్లు ప్రయోజనం కల్పించాం. చుక్కల భూములపై కలెక్టర్లకే అధికారం ఇచ్చాం. ఆర్డీవో ద్వారా సమస్యలు పరిష్కరించేలా చేశాం. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఇస్తున్నాం. రూ.50కోట్లతో జగజ్జీవన్ రామ్ స్మృతి వనం అబివృద్ది. ఉద్యోగులకు ఒక డిఏ ఇస్తున్నాం.
కోల్ కత్తా సభతో బిజెపి నేతలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ నిధులని గడ్కరి వ్యాఖ్యలు అబద్దం.
మహారాష్ట్ర,గుజరాత్,ఉత్తరప్రదేశ్ కే ఎక్కువ నిధులు. ఒక్క బుల్లెట్ ట్రైన్ కే రూ.లక్ష కోట్లుపైగా కేటాయించారు.ఏపికి ఇచ్చినవన్నీ టోల్ పెట్టి వసూలు చేసే రోడ్లే.ఏదో ఏపిని ఉద్దరించినట్లు బిజెపి నేతల వ్యాఖ్యలు.అన్ని రాష్ట్రాలతోపాటే ఏపికి ఇచ్చారు. అంతేతప్ప ప్రత్యేకంగా ఏపికి ఇచ్చిందేమీ లేదు.బిజెపి పాలిత రాష్ట్రాలకన్నా తక్కువ ఇచ్చారు ఏపికి.పోలవరం నెలలో చేస్తామని ఏడాది జాప్యం చేశారు. డిపిఆర్ -2ఆమోదంలో ఏడాది జాప్యం. దీనికి ముందు గడ్కరీ సమాధానం చెప్పాలి. ఏ రాష్ట్రానికైనా మోది అంగీకారంతోనే నిధులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బిజెపి వల్ల జరగలేదు. మన స్వయంకృషి వల్లే ఏపి అభివృద్ది. నాలుగేళ్లలో ఏపి అభివృద్ధి ఘనత టిడిపిదే.డబ్ల్యుఈఎఫ్ ఇండెక్స్ లో 4.0తో ఏపి 49వ ర్యాంకులో ఉంది. అదే భారతదేశం 58వ ర్యాంకులో ఉంది. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి.25న రాష్ట్రంలో 3ప్రాంతాల్లో ‘పసుపు-కుంకుమ’ సభలు. అమరావతి,విశాఖ,కడపలో మహిళా సదస్సులు. 95లక్షల మహిళలను పేదరికం నుంచి బైటకు తెస్తున్నాం. ప్రతి మహిళకు రూ.10వేలు రాబడి వచ్చేలా చేస్తున్నాం.4లక్షల కుటుంబాలకు ఇంటిజాగాలు ఇచ్చాం. మిగిలినవాళ్లకు త్వరలో ఇస్తాం. 10లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మొత్తం 27లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నిజం చేస్తాము”అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వివరించారు.