ఈవీఎం హ్యాకింగ్ లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ పాత్ర!!

ఈవీఎం హ్యాకింగ్ లో
రిలయన్స్ కమ్యూనికేషన్స్ పాత్ర!!
EVM hacking

వాషింగ్టన్;

ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవసరమైన లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను పొందేందుకు బీజేపీకి టెలికామ్ దిగ్గజ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సాయపడిందని సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చెప్పారు. డేటాను ట్రాన్స్ మిట్ చేసేందుకు అవసరమైన దేశవ్యాప్త నెట్ వర్క్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి ఉందని.. దాని ద్వారా బీజేపీ లాభపడిందని ఆయన అన్నారు. భారత్ లో రిలయన్స్ కు 9 ప్రాంతాల్లో డేటా నెట్ వర్క్ పంపిణీ చేసే కేంద్రాలు ఉన్నాయని షుజా వివరించారు. ఈవీఎంలు హ్యాక్ చేసే ఉద్యోగులకు కూడా తాము ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్టు తెలియదని.. వాళ్లు కేవలం డేటా ఎంట్రీ పని చేస్తున్నట్టు అనుకుంటారని షుజా ఆరోపించారు.