ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం

ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం

ECI

ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని ఎన్నికల సంఘం మరోసారి ఘంటాపథంగా చెప్పింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని రుజువు చేసేందుకు లండన్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ఎన్నికల సంఘంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ ప్రదర్శన నిర్వహించారని చెప్పింది. దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు వాడుతున్న ఈవీఎంలలో గోల్ మాల్ చేయడం సాధ్యమే కాదని స్పష్టం చేసింది. ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ, అత్యంత భద్రత మధ్య తయారు చేస్తారని.. ఉత్పత్తి ప్రతి దశలోనూ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను సాంకేతిక నిపుణులతో కూడిన ఓ కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించింది. ఈవీఎంలపై బురద జల్లుతూ నిర్వహించిన ఈ హ్యాకింగ్ ప్రదర్శనపై చట్టపరమైన చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది.