హైదరాబాద్ లోనే ఈవీఎం ‘టామ్ పరింగ్’!!

హైదరాబాద్ లోనే ఈవీఎం ‘టామ్ పరింగ్’!!
EVM Tampering

– సైబర్ నిపుణుని సంచలనం:

వాషింగ్టన్:

గత లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ హ్యాకింగ్ ద్వారా రిగ్గింగ్ చేసిందని బాంబు పేల్చిన అమెరికాలోని సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా, ఈ కుట్రకి కేంద్రం హైదరాబాద్ అని చెప్పి మరో బాంబు పేల్చాడు. ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంల రూపకల్పన బృందంలో సభ్యుడైన షుజా.. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ విడుదల చేసే మాడ్యులేటర్ తో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నట్టు గుర్తించానని తెలిపాడు. లోక్ సభ ఎన్నికలలో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014లో తెలుసుకున్నట్టు సయ్యద్ షుజా చెప్పాడు. ఈ రహస్యాన్ని గుర్తించిన తమ బృందం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. బీజేపీ నేతలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించామని తెలిపాడు. హైదరాబాద్ శివార్లలో ఒక బీజేపీ నేత ఇంటికి తాము వెళ్లినట్టు వివరించాడు. అక్కడ తమపై కాల్పులు జరపగా తను గాయాలతో బయటపడి బతికినట్టు చెప్పాడు. ఈ కాల్పుల ఘటనను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్ లోని కిషన్ గఢ్ లో మత కల్లోలాన్ని, హింసాకాండను సృష్టించారని అన్నాడు. తన బృందంలోని ఇతర సహచరులను ఆ హింసలో చనిపోయినట్టు చూపించారని ఆరోపించాడు.