టీమిండియాకు మాజీ కివీ ఆటగాడి సవాల్!!

టీమిండియాకు మాజీ కివీ ఆటగాడి సవాల్!!

ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోకపోవడం ఇదే మొదటిసారి. టీ20 సిరీస్ డ్రా అయిన తర్వాత విరాట్ సేన టెస్ట్ సిరీస్ 2-1తో, వన్డే సిరీస్ 2-1తో నెగ్గింది.మెన్ ఇన్ బ్లూ ఇంకా విజయోత్సవ వేడుకలలోనే ఉన్నారు. ఇంతలోనే వారికి ఆస్ట్రేలియా పొరుగు నుంచి కొత్త సవాల్ వచ్చింది. టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పొరుగున ఉన్న న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉంది. మెల్బోర్న్ లో భారత జట్టు విజయం సాధించగానే న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు స్కాట్ స్టైరిస్ శుభాకాంక్షలు చెబుతూనే హెచ్చరిక జారీ చేస్తూ ట్వీట్ చేశాడు.‘గెలిచినందుకు శుభాకాంక్షలు బీసీసీఐ. ఎంట్రీ సమయం పూర్తయింది. ఇక మెయిన్ కోర్స్ వంతు’ అని ట్వీటాడు. అంటే భారత జట్టుకి ఇక అసలైన సవాల్ ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని తెలిపాడు. టీమిండియా ఇక న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇది నిజంగానే పెద్ద సవాల్ గా మారే అవకాశాలు ఉన్నాయి. కివీ టీమ్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది. ఇటీవలే కివీస్ పర్యటనకి వచ్చిన శ్రీలంకను 3-0తో చిత్తు చేశారు. ఇప్పుడు కోహ్లీ అండ్ కంపెనీ స్కాట్ స్టైరిస్ సవాల్ ని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.