ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మెసెంజర్ రీడిజైన్ చేసిన ఫేస్ బుక్.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మెసెంజర్ రీడిజైన్ చేసిన ఫేస్ బుక్.

న్యూఢిల్లీ:

ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సంస్థ, ఫేస్ బుక్ తన మెసేజింగ్ యాప్..మెసెంజర్ ను రీడిజైన్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లు రెండింటిలోనూ కొత్త ఇంటర్ ఫేస్ తో వస్తున్న ఎఫ్ బి మెసెంజర్ అప్ డేట్ ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇంటర్ ఫేస్ రీడిజైన్ చేస్తున్న విషయాన్ని ఫేస్ బుక్ మే 2018లో నిర్వహించిన తన ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్ లో ప్రకటించింది. కొత్త ఇంటర్ ఫేస్ లో చాట్ ఫీచర్ ను సరళతరం చేశారు. మరోసారి మెసేజ్ లను ముందు, మధ్యకి పెట్టారు.రీడిజైన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లేంటంటే ఇంతకు ముందున్న 9 ట్యాబ్ లను 3కి తగ్గించారు. ఇంటర్ ఫేస్ లో ఎక్కువ వైట్ స్పేస్ ని ప్రవేశపెట్టారు. గేమ్స్, బాట్స్ కోసం హిడెన్ బటన్స్ అమర్చారు. చాట్ బాక్స్ లో రిమైండర్ ఫంక్షనాలిటీస్ ఇచ్చినట్టు ది వర్జ్ తెలిపింది. మేలో ప్రకటన విడుదల చేసిన తర్వాత అక్టోబర్ లో రోల్ ఔట్ చేయాల్సి ఉండగా రీడిజైన్ కి సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ‘అప్ డేట్ ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరికొద్ది కాలం పట్టవచ్చని కంపెనీ చెప్పినట్టు’ ది వర్జ్ చెప్పింది. సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్ ని బ్రౌజ్ చేస్తూ యూజర్లు ఒకరికొకరు మెసేజ్ లు పంపుకొనేందుకు వీలుగా 2014లో డెస్క్ టాప్ కోసం మెసెంజర్ ను లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెసెంజర్ ను ప్రత్యేకమైన మొబైల్ యాప్ గా తయారుచేశారు.