నడవలేని కూతురి కోసం పెద్ద మంచు కోట కట్టాడు!!

నడవలేని కూతురి కోసం పెద్ద మంచు కోట కట్టాడు!!
OHIO Sinsinnati Father Built Igloo for his daughter

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటీ నగరానికి చెందిన ఓ తండ్రి వీల్ ఛెయిర్ కే అంకితమైన తన కూతురు తిరిగేందుకు వీలుగా మంచుతో ఒక కోట ఇగ్లూ కట్టి ఆన్ లైన్ లో అందరి మనసులు దోచుకున్నాడు. ఇండిపెండెంట్ పత్రిక కథనం ప్రకారం గ్రెగ్ ఈషాన్ కుమార్తె జహారా నడవలేదు. 19 ఏళ్ల జహారాకు కోట వంటి మంచు కోటలో తిరగాలని ఆశ. దీంతో గ్రెగ్ తన కూతురి ముచ్చట తీర్చేందుకు మంచుతో పెద్ద కోట కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఇగ్లూకి జహారా వీల్ ఛెయిర్ పట్టేంత పొడవు, వెడల్లు ఉండే ఒక పెద్ద తలుపు కూడా అమర్చాడు.గ్రెగ్ సృజనకు సంబంధించిన ఫోటోలను అతని స్నేహితుడు డేనియల్ థామ్స్ ప్రముఖ సోషల్ మీడియా సైట్ రెడ్డిట్ లో పెట్టాడు. ఇలా పెట్టీ పెట్టగానే అవి వైరల్ గా మారాయి. ఒక ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న జహారా తన కోటలో ఉంది. మరో ఫోటోలో ఎత్తుగా తెల్లగా తళతళా మెరిసిపోతున్న మంచు ఇగ్లూ ఉంది. ఒక్కరోజు లోపలే ఈ రెడ్డిట్ పోస్ట్ కి 70,000కి పైగా అప్ ఓట్లు వచ్చాయి. ఇక వందల సంఖ్యలో కామెంట్లు సరేసరి. చాలా మంది మనసుని తట్టి లేపిందని తెలిపారు.తన పాప కోసం తయారుచేసిన ఇగ్లూకి సోషల్ మీడియాలో ఇంత పేరు వస్తుందని ఊహించలేదన్నాడు గ్రెగ్. మంచుతో ఓ పెద్ద కోట కట్టాలనుకున్నానని.. తన పిల్లల ఆనందం కోసం ఇగ్లూ తయారుచేయడం సంతోషాన్నిచ్చిందని చెప్పాడు.