కుంభమేళాలో అగ్నిప్రమాదం.

కుంభమేళాలో అగ్నిప్రమాదం.
null

లక్నో:

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఈ సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఆధ్యాత్మిక ప్రదర్శనలు జరుగుతున్న సెక్టార్ 13లోని కల్పవాసి క్యాంప్ లో మంటలు అంటుకున్నాయి. ఒక గుడారం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాదం సమాచారం అందుకోగానే ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వారమే ప్రారంభమైన కుంభమేళాలో ఇది రెండో అగ్నిప్రమాదం.కుంభమేళా ప్రారంభమైన జనవరి 15 తర్వాత రోజునే ప్రయాగరాజ్ దగ్గర ఉన్న దిగంబర్ అఖాడా శిబిరంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే మంటలను ఆర్పేయడంతో ఎవరికీ గాయాలు కాలేదు. 2019 కుంభమేళా మార్చి 4తో ముగుస్తుంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు 10 కోట్ల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా. కుంభ్ మొదటి రోజునే 2.2 కోట్ల మందికి పైగా భక్తులు షాహీ స్నాన్ ఆచరించారని తెలిసింది.