ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!!

ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!!

Amaravati

ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఐదుగురికి డిప్యూటీ సీఎంల పదవులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం అందింది. ప్రతీ వర్గంలోనూ కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. తన కేబినెట్‌ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాటికి కసరత్తు పూర్తి చేశారు. కేబినెట్‌లో చేర్చుకునేవారితో పాటు.. పదవుల కేటాయింపులో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
25 మందితో కేబినెట్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మంత్రులను మార్చాలని కూడా ఆయన భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.