కౌలు రైతు ఆత్మహత్య.

హైదరాబాద్:

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం, భాగవంత్ వీడు గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు, శుక్రవారం గాంధీ భవన్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడి శనివారం మృతి చెందాడు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ని కౌలు రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు.