నదిలో తిరుగుతున్న భారీ ఐస్ డిస్క్

నదిలో తిరుగుతున్న భారీ ఐస్ డిస్క్
Giant Ice Disk

హఠాత్తుగా ఈ వీడియో చూస్తే చంద్రుని ఉపరితలం మాదిరిగా కనిపించవచ్చు. కానీ ఇది నూటికి నూరుపాళ్లూ భూమి మీద జరిగిందే. మెయిన్ లోని వెస్ట్ బ్రూక్ ప్రాంతంలో ఉన్న ప్రిజంస్కాట్ నది నీటిపై సుమారు 100 గజాల వ్యాసం గల ఓ భారీ ఐస్ డిస్క్ ఏర్పడింది. ఇది అపసవ్య దిశలో తిరుగుతోంది కూడా.

వెస్ట్ బ్రూక్ నగర అధికారి ఒకరు ఈ అద్భుత దృశ్యాన్ని డ్రోన్ ద్వారా బంధించారు. ఈ వీడియోలో దాదాపు పూర్తి గుండ్రంగా ఉన్న డిస్క్ అపసవ్య దిశలో తిరుగుతూ కనిపిస్తోంది. ఈ అద్భుతం చూసిన నిపుణులు సాధారణంగా నెమ్మదిగా కదులుతున్న నది నీటిలో సుళ్లు తిరిగే చోట ఇలాంటి డిస్క్ లు ఏర్పడతాయని వివరిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు త్వరగా గడ్డకడుతుంది కనుక అక్కడ కేంద్రంగా ప్రారంభమై మంచు డిస్క్ విస్తరిస్తుందని చెప్పారు. ఇది సహజమైన విషయమే అయినా అరుదుగా చోటు చేసుకొనే అద్భుతం.