అశ్లీల ప్రకటనలను అడ్డుకోనున్న’ క్రోమ్ 71′.

Chorme

హైదరాబాద్:

ఆన్ లైన్ లో అశ్లీల, అసంబద్ధమైన విషయాలను అడ్డుకొనేందుకు గూగుల్ కొరడా ఝుళిపించింది. ఒక వెబ్ పేజ్ పై అశ్లీలమైన వ్యాపార ప్రకటనలను అడ్డుకొనబోతున్నట్టు ప్రకటించింది. ఒక వెబ్ పేజ్ పై అసభ్యమైన వ్యాపార ప్రకటనలు వస్తుంటే ఆ పేజ్ ను బ్లాక్ చేస్తామని తెలిపింది. వెబ్ పేజీలలోకి చొరబడి తప్పుదోవ పట్టించే యాడ్స్ ద్వారా హానికరమైన వెబ్ సైట్లకు మళ్లించడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రయత్నాలను అడ్డుకొనే చర్యల్లో భాగంగా గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచే సైట్లలో అశ్లీల వ్యాపార ప్రకటనల జాబితాలోని యాడ్స్ ని బ్లాక్ చేయనున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన క్రోమ్ 71 వెబ్ బ్రౌజర్ లో దీనిని ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.క్రోమ్ వెబ్ బ్రౌజర్ తో యూజర్లు భద్రంగా వెబ్ పేజీలు చూసేందుకు గూగుల్ ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు. జూలైలో విడుదల చేసిన గూగుల్ క్రోమ్ 68లో వెబ్ సైట్ల నుంచి కొత్త ట్యాబ్స్ లేదా విండోస్ తెరచుకోకుండా అడ్డుకొనే ఫీచర్ ప్రవేశపెట్టింది. అశ్లీల అసంబద్ధ వ్యాపార ప్రకటనలను అడ్డుకొనేందుకు కొద్దికాలంగా గూగుల్ ఎప్పటికప్పుడు తన వెబ్ బ్రౌజర్ లో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది’