అటవీ అధికారులపై దాడికి కేంద్రం సీరియస్!!

న్యూఢిల్లీ:

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అటవీశాఖ మహిళా అధికారిపై జరిపిన దాడిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. ఈ దాడిని కేంద్ర సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారంనాడు ఆయన మాట్లాడుతూ, అధికారులపై దాడులను తాము తీవ్రంగానే తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలను సరిచేయాల్సిన బాధ్యత తమకు ఉన్నందున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.