మా ఆయన మంచోడు : ఎంజె అక్బర్ భార్య!!


న్యూఢిల్లీ:

లైంగిక వేధింపుల ఆరోపణలతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజె అక్బర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తన భర్తపై వస్తున్న ఆరోపణల దాడికి అడ్డుకట్ట వేసేందుకు మౌనం వీడారు. ఎంజె అక్బర్ పై వస్తున్నవన్నీ అబద్ధాలని మల్లికా అక్బర్ చెప్పారు. అమెరికాలో ఉంటున్న భారతీయ జర్నలిస్ట్ పల్లవి గొగొయ్ అనే మహిళ రెండు దశాబ్దాల క్రితం అక్బర్ తనను రేప్ చేశాడని ఆరోపించినందువల్ల తను నోరు విప్పక తప్పడం లేదని మల్లిక తెలిపారు. పల్లవి గొగోయ్ తో కలిసి తన భర్త తనను మోసం చేశాడని చెప్పారు. పల్లవితో వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో గొడవలు జరిగాయని వివరించారు. రుజువులతో సహా తను నిలదీయడంతో అక్బర్ పల్లవితో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాడన్నారు. పల్లవి గొగొయ్ తనపై చేసిన అత్యాచార ఆరోపణలను మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలే అని కొట్టి పారేశారు. తమ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనని.. అది ఇద్దరి సమ్మతితో కొన్ని నెలల పాటు కొనసాగిందన్నారు. కుటుంబంలో గొడవలు జరుగుతున్నందువల్ల అర్థంతరంగా అది ముగిసిందని అక్బర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 1994లో పల్లవి గోగొయ్‌కి, తనకు మధ్య ఉన్న సంబంధానికి అప్పట్లో తనతో పనిచేసిన పలువురు సాక్షులని తెలిపారు.