తెలంగాణలో ‘హై అలర్ట్’.

  • బీజేపీ,టీఆరెస్ నేతలను అప్రమత్తం చేసిన పోలీసులు.
  • మావోయిస్టుల దాడి పై ఎన్ఐఏ ‘క్లూ’.

హైదరాబాద్:

తెలంగాణ ఎన్నికల్లో మావోయిస్టుల దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అన్ని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పోలీస్ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ‘హై అలర్ట్’ గా ఉండాలని NIA తెలిపింది.తెలంగాణ లో టిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులు, నాయకులను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఎన్ ఐ ఏ చెబుతున్నది. కాంగ్రెస్ పట్ల మావోయిస్టులు సానుకూలంగా ఉన్నారని కూడా ఎన్ ఐ ఏ సమాచారం అందించింది. ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీఆరెస్ లపై దాడులకు గాను చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని దండకారణ్యంలో రెండు నెలలుగా మావోయిస్టులు కసరత్తు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలంగాణ డిజిపి ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టుల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలతో పోలీసులు, ఎస్.ఐ.బి తదితర ఏజన్సీలు సిద్ధమైనవి.