హైకోర్ట్ విభజనకు సుప్రీం కీలక ఉత్తర్వులు!!

న్యూఢిల్లీ:

మౌలిక వసతులన్నీ సిద్ధమైతే హైకోర్టు విభజనకు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీంకోర్ట్ తెలిపింది. ఉమ్మడి హైకోర్ట్ విభజనపై సుప్రీంకోర్ట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 29నే జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏపీ హైకోర్ట్ కొత్త భవనంలో వీలైనంత తొందరగా ప్రారంభమై పని చేస్తుందని చెప్పింది. జనవరి 1, 2019కి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయడం మొదలవుతాయంది.డిసెంబర్ 15, 2018 కల్లా తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. జడ్జిల నివాసాల కోసం విల్లాలను ఏర్పాటు చేస్తున్న ఏపీ సర్కార్ వెల్లడించింది. అమరావతిలో జస్టిస్ సిటీ పేరుతో ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని.. అందులోనే హైకోర్ట్ సబార్డినేట్ కోర్టు జడ్జిల వసతి సదుపాయాలు, నివాస గృహాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అప్పటి వరకు తాత్కాలిక భవనాల్లో హైకోర్ట్ కొనసాగుతుందన్నారు. దీనిపై పరిశీలనకు వెళ్లిన ఇన్స్ పెక్షన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీకి వెళ్లే హైకోర్ట్ న్యాయమూర్తులు సంతృప్తి చెందారు.