అమేజింగ్ వీడియో: జంపింగ్ జపాంగ్

అమేజింగ్ వీడియో: జంపింగ్ జపాంగ్

ఈక్వెస్ట్రియన్ షో జంపింగ్ లో మేలు జాతి గుర్రాలు పరుగెడుతూనే ఇంతింత ఎత్తులు దూకడం చూశాం. డిస్కవరీ, ఎన్జీసీ వంటి జంతువుల షోలలో చిరుతపులులు, లేళ్లు చెంగున అంతెత్తుకు ఎగిరి దూకి పరిగెత్తడాన్ని చూశాం. కానీ మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో తీసిన ఈ వీడియో ముందు ఇవన్నీ బలాదూర్ అనిపించక మానవు. పశ్చిమ కనుమలలోని దుండిగల్ ప్రాంతంలో తీసినట్టుగా భావిస్తున్న ఈ వీడియోలో కొన్ని అడవి దున్నలు, బర్రెలు తమంత ఎత్తున్న కంచెను అవలీలగా దూకేస్తున్నాయి. అది కూడా పరుగెత్తుకు రావడం, ఆయాసపడుతూ దూకడం కాదు.. అలా కంచె దగ్గరకు రావడం ముందు కాళ్లు ఇలా లేపి అలా దాటేయడం.. ఆ వెంటనే వెనుక కాళ్లను కంచె దాటించేయడం. ఎక్కడా తడబాటు లేదు.. కాళ్లు కంచెని తాకిందీ లేదు. ఆ వీడియోను మీరు ఓ సారి చూడండి