కమల్ కు హిందూ మహాసభ బెదిరింపు

లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూత్వవాదులు మండిపడుతున్నారు. కమల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రాణాలు తీస్తామని హిందూ మహాసభ హెచ్చరించింది. కమల్ హాసన్ వెంటనే తన గాడ్సే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకపోతే నాథూరామ్ గాడ్సే గాంధీజీని హత్య చేసినట్టు తాము కమల్ హాసన్ ని హత్య చేయాల్సి వస్తుందని బెదిరించింది.

కమల్ హాసన్ వంటి మూర్ఖులు దేశంలోని 100 కోట్ల హిందువులకు కళంకంగా మారారని హిందూ మహాసభ ఘాటుగా విమర్శించింది. హిందూ పదానికి అర్థం తెలియకుండా వాగుతున్నారని మండిపడింది. హిందూ అనేది ఒక సరళమైన జీవన విధానమని వివరించింది. ఇవాళ కమల్ హాసన్ వంటి మోసగాళ్లు ఓట్ల కోసం నాథూరామ్ గాడ్సే పేరుని వాడుకుంటూ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగింది. దేశంలోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం లభిస్తోందంటే అది కమల్ హాసన్ వంటి మూర్ఖుల కారణంగానేనని, ఇలాంటి వారికి ఫారుఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సిద్ధూ వంటి అనేక మంది వ్యక్తులు మద్దతిస్తున్నారని దుయ్యబట్టింది. దేశ సమైక్యత, అఖండతకు చేటు చేసేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

Hindu Mahasabha’s veiled threat to Kamal Haasan, wants Haasan to withdraw the statement

India, National, Politics, Kamal Haasan, Hindu Mahasabha, veiled, threat, veiled threat, statement, Hindu Terror, Death Threat, Hindu, Mahatma Gandhi, Muslims, Independent India, Nathuram Godse, India’s first terrorist was a Hindu, Godse Independent India’s first Terrorist