తలసానితో సిటీ అభివృద్ధి పరుగులు. -మంత్రి కేటీఆర్ పరుగులు.

హైదరాబాద్:

అన్నా అంటే నేనున్నానంటూ ప్రజల ముందు వాలిపోయే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని కేటీఆర్ పొగిడారు.జలవిహార్ లో టీఆరెస్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.తలసాని గెలుపు ఖాయమని, మర్రి శశిధర్ రెడ్డికి తెలుసునన్నారు.కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.అర్థరాత్రి ముందస్తు పెట్టినా సిద్ధమే అని ఉత్తమ్ అన్నారని, ఎన్నికల కమిషన్ ముందు శశిధర్ రెడ్డి ఎన్నికలకు తొందరేముందన్నాడని కేటీఆర్ విమర్శించారు.శిశువుకైనా, కొత్త రాష్ట్రానికైనా మెదట ఐదేళ్ళు చాలా కీలకం అని ఆయన గుర్తు చేశారు.కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రాజక్టులకు పెద్దపీట వేశారని తెలిపారు.

కాంగ్రెస్ భావ దారిద్ర్యంతో బాధపడ్తోంది. రైతాంగం నోట్లో మట్టికొడ్తోందన్నారు.చనిపోయిన వారి వేలి ముద్రలతో ప్రాజక్టులపై కేసులేశారని ఆరోపించారు.రాజకీయం‌ కోసం కాంగ్రెస్ నాయకులు తన కొడుకును, ఇంట్లో చిన్నపిల్లలను కూడా వదలటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అరాచకాలు భరించలేకనే తొమ్మిది నెలల ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని కేటీఆర్ సమర్ధించారు.ముందస్తు కోసం తాము పదవులను త్యజిస్తే ప్రతిపక్షం మాత్రం వణికిచస్తోందన్నారు.2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ముందస్తుకు పోయిన విషయం అమిత్ షాకు గుర్తులేదా? అని ప్రశ్నించారు.రాష్ట్రాలు లేనిదే.. కేంద్రం లేదని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని,రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేసిన BJP భారతీయ జూఠా పార్టీ గా మారిందన్నారు.బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భ్రమలో బతికే భ్రమిత్ షా అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీతోనే టీఆర్ఎస్ కు పోటీ ఉంటోందని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఎక్కడ కాలు పెడ్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతోందన్నరు.సమాజ్ వాదీ పార్టీ అమేథి, రాయ్ బలేరీలో పోటీ పెడ్తే రాహుల్, సోనియా కూడా ఓడిపోతారని చెప్పారు.మహా కూటమి కాదు,తెలంగాణ పాలిట స్వాహా కూటమి అని ఆరోపించారు.హైద్రాబాద్లో చేయాల్సిన పనులు చాలానే మిగిలున్నాయని తెలిపారు.

‘మాకు ఆంధ్ర, తెలంగాణ అనే పంచాయతీ లేదు. ఇక్కడ ఉండే ప్రతీ బిడ్డ తెలంగాణ వాళ్ళే.మాకు ఓవైసీ, మోదీ అంటే భ‌యం లేదు.‌. మేము ప్రజలకే భయభయపడ్తాం.తలసాని లాంటి నాయకుడుంటే.. హైద్రాబాద్ త్వరితిగతిన అభివృద్ధి చెందుతోంది.హైద్రాబాద్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చాల్సినవసరం ఉంది.మిషన్ హైద్రాబాద్ పేరిట సిటీలో డ్రైనేజి, రోడ్లును బాగుచేసే బాధ్యత నాదే.సిటీలో నాలుగైదు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను తలసాని తీసుకోవాలి” అని కేటీఆర్ అన్నారు.