ఐఏఎస్ మురళికి అంతర్జాతీయ ఆహ్వానం.

Ias

హైదరాబాద్:

“క్రియాశీలక ఉపాధి కల్పన, లేబర్ మార్కెట్ కాన్ఫెరెన్స్ లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐఏఎస్ మురళిని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆహ్వానించింది.అంతర్జాతీయ స్థాయిలో ఆసియా అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) సంయుక్తంగా నవంబర్ 12 నుండి 14 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫెరెన్స్ లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా శ ఆకునూరి మురళిని ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు పాల్గొనే ఈ కాన్ఫెరెన్స్ లో అసియా ఖండంలో పేదరికం , నిమ్నవర్గాలు మరియు అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు, కార్మికులకు నైపుణ్యాభివ్రుద్ధి కార్యక్రమాల రూపకల్పన మీద చర్చ జరగనున్నది. ఈ అంశం మీద మురళిని ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నిర్వహకులు కోరారు.మీటింగ్ ‌ఆహ్వానాన్ని అంగీకరించి‌ సమావేశానికి వేడుతున్నట్టు మురళి తెలియజేశారు.