‘ఆత్మ గౌరవం’ కోసం IAS లు సంఘటితం.

హైదరాబాద్;

వివిధ ప్రధాన తెలుగు దిన పత్రికల్లో మంగళవారం వచ్చిన వార్త ఇది.

స్వరాష్టంలో తెలంగాణ SC/ST/BC/ Minority IAS అధికారులపై వివక్ష – IAS Association Club లో అత్యవసర సమావేశం జరిగింది.
తెలంగాణ IAS ఆపీసర్లకు ప్రత్యేక సమస్యలు వున్న కారణంగా తెలంగాణ స్థానిక IAS ఆఫీసర్ల సంఘం ఏర్పాటు.

➖ _*తెలంగాణ (జనరల్) IAS సంఘం కూడా‌‌ ఈ SC,ST,BC, Minority ,IAS అధికారుల సమస్యలను పట్టించుకోవడం లేదు.*_

➖ _*తెలంగాణ స్థానిక (Native) IAS ఆఫీసర్లు 20 కి పైగా ఆఫిసర్లను దిక్కుమాలిన పోస్టులలో నియమించారు.*_

➖ _*ఇందులో మెజారిటీ ఆఫీసర్ల పోస్టులు IAS ఆఫీసర్లను వెయాల్సిన పోస్టులు కావు.*_

➖ _*ఇందులో ఒక్కరు తప్ప మిగతా అందరు SC (3), ST (6) , BC (9) , Minority (3) వున్నారు.*_

➖ _*OC కులాల నుండి IAS కానివాళ్ళకు కూడా IAS పోస్టులు కట్టెబెట్టారు.*_

➖ _*ప్రత్యేకంగా టార్గెట్ చేసి 6 గురు SC,ST,BC , IAS అధికార్లను‌ సెక్రెటెరియట్ లో గుమస్తా లాంటి పోస్టులలో ఏళ్ళు తరబడి (ప్రస్తుత ప్రభుత్వం) వుంచుతున్నారు.*_

➖ _*ఈ ప్రభుత్వం లో అధికారుల సమస్యలను ఎవరికి చెప్పుకుంటే పరిస్కారం‌ దొరుకుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఈ అధికారులు వున్నారు.*_

➖ _*తెలంగాణ రాష్ట్రం లో తొలి లంబాడ IAS మహిళా భారతి నాయక్ ను గత నాలుగు సంవత్సరాలుగా సచివాలయం లో గుమస్తా లాంటి పని లేని పోస్టులో వుంచారు.*_

➖ _*దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉద్దేశ పూర్వక, విద్వేశ పూరిత వివక్ష తెలంగాణ లో కనపడుతుంది.*_

➖ _*ఇంతకు పూర్వం ప్రభుత్వాలు అనుసరించిన అన్ని రకాల విధానాలను (Established Convention and Norms) ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.*_

➖ _*ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ స్థానిక (Native) IAS ఆఫీసర్లకు మాత్రమే ఈ దిక్కుమాలిన పోస్టులు ఇచ్చి పూర్తిగా‌‌ అవమానించి బంగారు తెలంగాణ అభివ్రుద్ది లో భాగస్వామ్యం లేకుండా చేసారు. మిగతా అన్ని రాష్ట్రాల (ఆంధ్రతో సహా) IAS అధికారులకు మంచి పోస్టులు ఇచ్చి కేవలం‌ తెలంగాణ IAS అధికారులను మాత్రమే అవమానించడాన్ని ఎమనుకోవాలి.*_

➖ _*అత్యున్నత స్థానంలో వున్న‌ తెలంగాణ IAS అధికారులకే దిక్కు ముక్కు లేని పరిస్థితి లో‌ వుంటె సామాన్య ప్రజలకు మేము ఏమి చేయగలమని తీవ్ర మానసిక‌ వేదనకు గురి అవుతున్నారు.*_

➖ _*గత్యంతరం లేని పరిస్థితి లో తెలంగాణ స్థానిక అధికారుల సంఘంగా ఏర్పాడాల్సి వచ్చింది.*_

_ఈ సమావేశానికి 20 మందికి పైగా తెలంగాణ IAS అధికారులు హాజరయ్యారు._

*దిక్కుమాలిన పోస్టు లలో వున్న తెలంగాణ స్థానిక (NATIVE) IAS ఆఫీసర్లు.*

(1). భూసాని వెంకటేశ్వర్లు
(BC).
(2). RV చంద్రవదన్ (BC)
(3). B వెంకటేశం (BC)
(4). L శశిధర్ (BC)
(5). డా అశోక్ (SC)
(6). M వీరబ్రహ్మయ్య (BC)
(7). అనిత రాజేంద్ర (BC)
(8). దినకర్ బాబు (BC)
(9). G కిషన్ (BC)
(10). MD అబ్దుల్ ఆజీమ్ (మైనార్టి)
(11). K నిర్మల (OC)
(12). L శర్మన్ (ST)
(13). A మురళి (SC)
(14). M చంపాలల్ (ST)
(15). భారతి నాయక్ (ST)
(16). KY నాయక్ (ST)
(17). DV రావు (ST)
(18). అరవిందర్ సింగ్ (మైనారిటీ)
(19). K లక్ష్మి (ST)
(20). బాల మాయదేవి (SC)
(21). అమెయ్ కుమార్ (BC)

_*NoN – IAS and Retired అఫీసర్లకు IAS పోస్టులు ఇచ్చిన వారి పేర్లు.*_

(1). వెంకట్రామ‌రెడ్డి – కమీషనర్ ( Horticulture) (ఇతను రిటైర్డ్ అఫీసర్ కు 7 పోస్టులు ఇచ్చారు).
(2). గోపాల్ రావు (వెలమ) (12 సంవత్సరాల క్రితం రిటైర్డ్ ఇంజనీర్) – CMD/SPCDL , వరంగల్.
(3). నరసింహ రెడ్డి – MD పరిశ్రమల కార్పోరేషన్
(4). మనోహర్ MD Tourism Corporation
(5). వేణుగోపాల్ (MD అరోగ్య మరియు వైద్య మౌలిక వసతులు కార్పొరేషన్
(6). రఘురామ‌రెడ్డి (రిటైర్డ్ ఇంజనీర్) – CMD – NPDCL
(7). సత్యనారాయణ (రిటైర్డ్ ఇంజనీర్ ) ED Metro Water Works.
(8). కేశవులు – MD Seed Devp.Corp.
(9). అదే కోవలో ఉద్యాన శాఖ కమీషనర్ వెంకటరామిరెడ్డి పదవీ వరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ అదే పదవిలో కూర్చొబెట్టింది.