ఆర్నెల్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం

ఏప్రిల్ నెలలో దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం ఆర్నెల్ల గరిష్ఠానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే తొమ్మిది నెలలకు రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్న స్థాయి కంటే దిగువనే ఉంది. మార్చిలో 2.86 శాతంగా ఉన్న వార్షిక రీటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 2.92 శాతానికి పెరిగింది. నిపుణుల అంచనాలకు కొద్దిగా దిగువనే ఉన్నట్టు సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. రాయిటర్స్ వార్తాసంస్థ నిర్వహించిన పోల్ లో ఏప్రిల్ నెల రీటైల్ ద్రవ్యోల్బణం 2.97 శాతానికి చేరవచ్చని అంచనాలు వచ్చాయి.

నవంబర్ 2013లో 12 శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు భారీగా పతనమైంది. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనతేనని చెప్పుకుంటున్నారు. తక్కువ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉన్నప్పటికీ తగ్గుతున్న వ్యవసాయ ఆదాయాలు, రికార్డు స్థాయిలో ఉన్న నిరుద్యోగం కారణంగా డిమాండ్, ఆర్థిక వృద్ధిని దెబ్బ తీశాయి.

జనవరి-మార్చి 2020కి రీటైల్ ద్రవ్యోల్బణం 3.8 శాతానికి తక్కువగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అయితే ఆహార పదార్థాలు, ఇంధన ధరలు భారీగా పెరిగితే లేదా ఆర్థిక లోటు లక్ష్యాలకు మించి ఉంటే ఇది ఎక్కువ కావచ్చని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్ నెలలో రీటైల్ ఆహార పదార్థాల ధరలు 1.10 శాతం పెరిగాయి. మార్చి నెలతో పోల్చి చూస్తే 0.30 శాతం పెరుగుదల కనిపించింది.

India April inflation hits six-month high; keeps rate cut hopes alive

India, National, Economy, April, Inflation, Rate cut