ఇన్నోవా బోల్తా.. ఇద్దరిమృతి.

ఇన్నోవా బోల్తా..
ఇద్దరిమృతి.

డిచ్‌పల్లి:

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరు భువనేశ్వర్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ప్రకాష్‌, చందాగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.