ఆటలు జీవితంలో భాగం కావాలి. -పూర్ణ:

ఆటలు జీవితంలో భాగం కావాలి.
-పూర్ణ:

null
హైదరాబాద్:

ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆటలు భాగం కావాలని
పూర్ణ చెప్పారు.అవి ఆరోగ్యంతో పాటు.. జీవితాన్ని ఇస్తాయని తన విషయంలో అదే జరిగిందన్నారు.సరదాగా నేర్చుకున్న ‘రాక్ క్లయింబింగ్’ తన జీవితాన్నే మార్చేసిందన్నారు.భువనగిరిలో తన కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించినప్పుడు ఎవరెస్టు అధిరోహిస్తానని ఎప్పుడూ అనుకోలేదని పూర్ణ తెలిపారు. కోచ్ తనలో ఆత్మస్థైర్యం నింపారన్నారు.కొండలు ఎక్కేటప్పుడు భయంతో ప్రారంభమైన తన అడుగు శిక్షణ పూర్తయ్యాక పూర్తి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించిందన్నారు. తన ప్రయాణం ఇక్కడితో ఆపనని తెలిపారు. అన్ని ఖండాల్లోని ఎతైన శిఖరాలు అధిరోహించాలనేది తన సంకల్పం, సివిల్స్ సాధించటం తన లక్ష్యంగా పూర్ణ చెప్పారు.హైదరాబాద్ హెచ్ఐసీసీలో ‘తెలంగాణ జాగృతి’ ఆద్వర్యంలో కొనసాగుతోన్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఆదివారం ‘జాగృతి’ అధ్యక్షురాలు కవిత, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాలావత్ పూర్ణ, రెజ్లర్ బబితా కుమారి పోగొట్ పాల్గొన్నారు.పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ
‘ప్రభుత్వాలు పౌరులకు ఫిజికల్ లిటరసీ కల్పించాలి.ఆట వ్యక్తికి, ప్రాంతానికి, సమాజానికి, తెగకు పేరు తెచ్చిపెడుతుంది. ఆరోగ్యానికి, కెరీర్ కు, పేరు ప్రఖ్యాతలకు అన్నిటికీ ఆటే మార్గం.
ఆటలు, కళలు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, భవితను కల్పిస్తాయి. ప్రభుత్వాలు క్రీడలపై నిధుల కేటాయింపు పెంచాలి.” అని అన్నారు.
రెజ్లర్ బబితా పోగొట్ మాట్లాడుతూ “కరణం మల్లీశ్వరి ఒలింపిక్ పతకం సాదించినప్పుడు మాలో ఆలోచన కలిగింది.మాకు స్ఫూర్తి, రోల్ మోడల్ మా నాన్నే.వారి అంకితభావం, మేం పడ్డ శ్రమ, మీ ప్రేమే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.మూవీలో చూయించిన దానికన్నా.. నాన్న మాకు కఠిన శిక్షణ ఇచ్చాడు. దాని ఫలితం మమ్మల్ని ఇక్కడివరకు నడిపించింది.ఏ రంగంలో అయినా రాణించాలంటే.. క్రమశిక్షణ చాలా అవసరం.చుట్టూ ఉన్న సమాజం వ్యతిరేకించినా.. మనలో ఉన్న సంకల్పం, ఆత్మవిశ్వాసమే మనల్ని గెలిపిస్తుంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను అతి సున్నితంగా పెంచకుండా.. వారికి ధైర్య సాహసాలు నూరిపోయాలి. అది కెరీర్ తో పాటు జీవితంలో ఉపయోగపడుతుంది మూవీలో చూపించినట్లు శిక్షణ అబ్బాయిలతో కలిసి చేసాం. దాంతో మా నైపుణ్యం, సామర్థ్యం పెరిగింది. ఎవరేమన్నా లెక్క చేయలేదు” అని చెప్పారు.