వయోపరిమితి పెంపునకు నిరసన!!

వయోపరిమితి పెంపునకు నిరసన!!

Hyderabad:

ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 58నుండి61ఏళ్ళకు, వెద్య ఆచార్యుల వయోపరిమితి 58నుండి 65ఏళ్ళకి పెంచటాన్ని నిరసిస్తూ పెంచిన వయోపరిమితిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని మంగళవారం ఓయూ మెయిన్ లైబ్రరీ వద్ద శిరోముండనం నిరసనకి దిగిన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జెఏసి.విద్యార్థి నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో గుండుగీయించుకుని నిరసన తెలిపిన లా విద్యార్థి శ్రీశైలం.
1)ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
2)ప్రభుత్వ ఉద్యోగాల్లో తిష్టేషిన రిటైర్డ్ ఉద్యోగులను పీకి నిరుద్యోగులతో ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి.
3)భారీ రెండవ గ్రూప్2నోటిఫికేషన్ విడుదలచేయాలి.
4)తొలిగ్రూప్1నోటిఫికేషన్ ను వెంటనే విడుదలచేయాలి.
5)TRT సెలెక్టెడ్ అభ్యర్థులకి వెంటనే పోస్డింగ్స ఇచ్చి మరో TRT నోటిఫికేషన్ విడుదల చేయాలి
6)జులై నెల నుండి 3016నిరుద్యోగభృతి చెల్లించాలి
7)జెఎల్/డిఎల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
8)విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
9)మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగ ఉన్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
10)TSPSC ఉద్యోగాల క్యాలెండర్‌ ను విడుదలచేయాలి అనే డిమాండ్స్ తో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాని ఓయూ నుంచే నాంది పలుకుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వం డిమాండ్స్ ను నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకి సిద్దమవుతున్నట్లు నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్,రాష్ట్ర విద్యార్థి జెఏసి నేతలు వెంకటేష్ చౌహాన్, ఓరుగంటి కృష్ణ, సర్థార్ వినోద్ కుమార్,జగన్నాథ్ యాదవ్,తిరుపతి రెడ్డి,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.