జగన్ పై దాడి కేసులో విచారణ!!

జగన్ పై దాడి కేసులో విచారణ!!

హైదరాబాద్:

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసులో ఐదో రోజు NIA విచారణ జరుగుతున్నది.మరో రెండు రోజులు పాటు నిందితుడు శ్రీనివాసరావు ను హైదరాబాద్ లోని NIA కార్యాలయంలో అధికారులు ఇంటరాగేషన్ జరపాలని భావిస్తున్నారు.న్యాయవాది అబ్దుల్ సలీం సమక్షంలో నిందితుడుని NIA అధికారులు విచారిస్తున్నారు.జైల్లో ఉండగా 24 పేజీల లేఖ పై NIA విచారణ చేయనుంది.శ్రీనివాస్ రావు రాసిన 24 పేజీల లేఖ ను ఓ జైల్ అధికారి బలవంతంగా లాక్కున్నాడంటూన్న న్యాయ వాది సలీం.లేఖ ఇవ్వక పోతే అధికారులు పై హైకోర్టు కి వెల్లుతానంటున్న న్యాయవాది సలీం. NIA డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ. నిందితుడు శ్రీనివాస్ రావు చెప్పిన విషయాలన్నీ రికార్డ్ చేస్తున్న అధికారులు.వైజాక్ ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్
కి నోటీసులు ఇచ్చిన NIA.హర్షవర్ధన్ తో పాటు మరి కొద్దీ మంది కి నోటీసులు. నేడు విచారణ లో భాగంగా నోటీసులు అందుకున్న వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న NIA.