నేరేడు పండ్ల సీజన్ మధుమేహులకు వరం

Karimnagar:

అల్లనేరేడు చూడాడానికి నల్లగా అందంగా ఉంటాయి. తింటే వగరుగ, తిన్నకొద్ది తినాలనిపించే పండే అల్లనేరేడి. దీంతో అల్లనేరడి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం అల్లనేరేడి సీజన్‌ కావడంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్లు, రోడ్లుకు ఇరువైపుల ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద కొందరు రైతులు నేరుగా అమ్ముతున్నారు. వ్యాపారులు రైతులను వద్ద నుంచి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నారు. సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రాంతాలతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని తదితర గ్రామాల నుంచి రైతులు జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్నారు. కొంతమంది ఇంటి ఆవరణలలో, పొలాల గట్లపై కూడా నేరేడు చెట్లును పెంచుకుంటారు. కరీంనగర్‌ జిల్లాకు రోజుకు 1నుంచి 2 టన్నులు నేరేడు కాయలు వస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు ఒక కిలో రూ.200 నుంచి 250 పలుకుతుంది. సీజన్‌ ఆరంభం కావడంతో అధిక ధరలు పలుకుతున్నాయని వ్యాపారులు తెలిపారు. త్వరలో ధరలు తగ్గే అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు.