27న ‘జయహో బీసీ’ సభ: – టీడీపీ

27న ‘జయహో బీసీ’ సభ:
– టీడీపీ.

BC meeting at rajamahendravaram

రాజమహేంద్రవరం :

టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 27న రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ‘జయహో బీసీ’ బహిరంగ సభ నిర్వహిస్తామని విద్యుత్‌ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. కనీసం 3లక్షలకుపైగా బీసీలు హాజరవుతారని ఇప్పటికే అంచనా ఉందని, అయితే అంతకుమించి రావచ్చునని అన్నారు. ఆ రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే 32 సమాయత్త సభలు పెట్టామని, ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రమైన రాజమహేంద్రవరానికి అత్యధికంగా జనం తరలి వస్తారన్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక చినరాజప్పతో కలిసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. 1994 ఎన్నికల ముందు ఎన్టీ రామారావు రాజమహేంద్రవరం నుంచే ఎన్నికల శంఖారావం పూరించారని, ఇవాళ మళ్లీ బీసీ సభతో బాబు శంఖం పూరిస్తారని రాజప్ప తెలిపారు.