రిలయన్స్ జియో ‘జియో దివాలీ ధమాకా‘!!

Jio Diwali Offer

న్యూఢిల్లీ:

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ‘జియో దివాలీ ధమాకా‘ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ లో కంపెనీ తన కస్టమర్లకు 100% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. దివాలీ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ జియో ప్రస్తుత, కొత్త కస్టమర్లు ఇద్దరికీ అందజేస్తోంది. క్యాష్ బ్యాక్ తో పాటు కంపెనీ జియో ఫోన2 క్యాష్ బ్యాక్, ఫ్రీ జియోఫై వంటి ఇతర ఆఫర్లను అందిస్తోంది. కొన్ని ప్రత్యేక ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
-రూ.149 లేదా అంత కంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జ్ లపై కంపెనీ 100% క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ రిలయన్స్ డిజిటల్ కూపన్ రూపంలో ఇస్తారు. ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు ఆన్ లైన్ లేదా జియో స్టోర్స్ లో రీఛార్జ్ చేసుకోవాలి.క్యాష్ బ్యాక్ కూపన్ గరిష్ఠ పరిమితి రూ.500. అంత కంటే ెక్కువ క్యాష్ బ్యాక్ కి కంపెనీ రూ.500 విలువైన మల్టిపుల్ కూపన్లు ఇస్తుంది. మీరు రూ.9,999 రీఛార్జ్ చేస్తే రూ.500 కూపన్లు 20 ఇస్తారు. ఈ కూపన్లు మైజియో యాప్ లో క్రెడిట్ చేస్తారు. వీటిని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో 31 డిసెంబర్ లోగా రెడీమ్ చేసుకోవచ్చు.కార్ట్ కనీస విలువ రూ.5,000 ఉండాలి. ఒకేసారి 2 కూపన్లు రెడీమ్ చేసుకొనడానికి వీల్లేదు.
రూ.1,699 విలువైన స్పెషల్ వార్షిక ప్లాన్ కూడా లాంచ్ చేశారు. ఇందులో 1 ఏడాదికి అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ఇస్తారు.
ఏదైనా 4జీ ఫోన్ కొంటే రిలయన్స్ జియో కంపెనీ రూ.2,200 ఇన్ స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ఆఫర్ రూ.198/రూ.299 రీఛార్జ్ లపై లభిస్తుంది.-పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే, మొబిక్విక్ ద్వార రూ.398 అంత కంటే ఎక్కు రీఛార్జీ చేస్తే యూజర్లకు రూ.300 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.-ఎల్జీ స్మార్ట్ టీవీ కొన్న కస్టమర్లకు ఉచిత జియోఫై, రూ.2,000 వరకు డేటా బెనిఫిట్, ఫ్రీ జియో మెంబర్ షిప్ లభించనుంది.రూ.2,999 విలువైన జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ కొంటే జియో రూ.200 పేటీఎం క్యాష్ బ్యాక్ ఇస్తోంది.