గల్ఫ్ బాధితురాలికి జర్నలిస్ట్ బాసట.

గల్ఫ్ బాధితురాలికి
జర్నలిస్ట్ బాసట.
Journalist Helped Gulf Victim

కాకినాడ:

తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అన్నపూర్ణ ఇండ్లలో పని చేయడానికి బహ్రెయిన్ కు వచ్చింది.ఏజెంట్ మోసానికి గురయింది. తీవ్ర ఇబ్బందులతో అన్నపూర్ణ
గల్ఫ్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్న వాసుదేవరావును ఆశ్రయించింది. ఆమెకు అండ గ ఉండి, ఏజెంట్ చెర నుండి విడిపించాడు.ఇండియా కు తిరిగి ప్రయాణానికి అన్ని విధాల సహకరించి ఎమిరేట్స్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు పంపించారు.సొంతగడ్డపై ఉపాధి కరువై.. కోటి ఆశలతో గల్ఫ్‌బాట పట్టిన తూర్పుగోదావరి జిల్లావాసులెందరో విగతజీవులుగా ఇళ్లకు చేరుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, సరైన పని దొరకక, అక్కడి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలున్నాయి. మరికొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఉపాధి వేటలో ఎందరో తెలుగు వారు గల్ఫ్‌ బాట పడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్‌ చెప్పిన పని లేకపోవడం, పనిచేసే చోట ఒత్తిడి తట్టుకోలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి.