‘కోడ్’కూయని కరీంనగర్. కేసీఆర్ హెలిప్యాడ్ వివాదం

Trs

విశ్వనాథ్, కరీంనగర్:

రాజు తలుచుకుంటే సాధ్యం కానిదేమిటి?
ఆపద్ధర్మ సిఎం ఇంటి ముందు హెలిప్యాడ్ నిర్మాణానికి ఏకంగా సర్కారు నిధులనే కేటాయిస్తున్న వైనంపై ఆరోపణలు వస్తున్నాయి
కరీంనగర్ లోని కేసీఆర్ ఇల్లు ప్రైవేట్ ది. చుట్టు పక్కల జనావాసాలున్నవి. ఇళ్లు నేలమట్టం చేసి హెలిప్యాడ్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల ‘కోడ్’ ఉన్నప్పుడు ఇలాంటి నిర్మాణం సమంజసమా? కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా ! రాదా !! అన్నది ఎన్నికల కమిషన్ చెప్పవలసి ఉన్నది.
కరీంనగర్ శివారులోని తీగలగట్టపల్లిలోని ‘ఉత్తర తెలంగాణ భవన్’ టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నివాసంగా ఉన్నది. 2005లో కేసీఆర్ ఈ భావనాన్ని నిర్మించుకున్నారు. కేసిఆర్ తరచూ హెలీకాప్టర్ లోనే అక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. తన ఇంటి సమీపంలో హెలిప్యాడ్ ను నిర్మించాలని కేసీఆర్ బావించారు. హెలిప్యాడ్ నిర్మించేందుకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. చుట్టు పక్కల ఇళ్లు కూడ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ హెలిప్యాడ్ ను నిర్మించేందుకు 15.14 ఎకరాల రైతు భూమి (సర్వే సంఖ్య 232) భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. లోక్త్ సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గవర్నర్ కు, ఎన్నికల కమిషన్ కు, చీఫ్ సెక్రటరీ కి దీనిపై ఫిర్యాదు చేశారు. 20 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ఇది పూర్తిగా ఎన్నిక నియమాలను ఉల్లంఘించడమేనని లోక్ సత్తా ఆరోపించింది. ఇప్పటికే కలెక్టరేట్లో హెలీప్యాడ్ ఉన్నది. తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్ దగ్గర
హెలిప్యాడు అవసరం లేదని, టీఆరెస్ స్వంత ప్రయోజనాల కోసమే దీని నిర్మిస్తున్నారని, వెంటనే దీనిని ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. కేసీఆర్
నివాసం సమీపంలో హెలిపాడ్ ను ఎలా నిర్మిస్తారని టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దాంతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని అన్నారు. ప్రజా ధనం దుర్వినియోగంపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు దారి తీస్తుందన్నారు. “భూమిని స్వాధీనం చేసుకునేందుకు అక్టోబర్ 26 న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది” అని ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వం ధనం దుర్వినియోగం, భూసేకరణ వ్యవహారంపై వెల్లువెత్తుతున్న విమర్శలతో కరీంనగర్ జిల్లా అధికారయంత్రాంగం అయోమయంలో పడింది.