కరుణానిధి ‘క్రిటికల్’

చెన్నై :

తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం ఆయన కావేరి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యం మరింత విషమించినట్టు ఆ హాస్పటల్ వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. క్రిటికల్ కేర్‌లో ఉన్న కరుణానిధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు హాస్పటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన వయసు సమస్యల దృష్ట్యా శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం కష్టతరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. రాబోయే 24 గంటల్లో చికిత్సకు కరుణానిధి స్పందించిన రీతిని బట్టే తదుపరి ట్రీట్‌మెంట్ ఉండబోతుందని డాక్టర్లు చెబుతున్నారు.