ఎర్రవల్లిలో ఐదు రోజుల ‘వేద ఘోష’.

ఎర్రవల్లిలో ఐదు రోజుల ‘వేద ఘోష’.

హైదరాబాద్:

ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన సహస్ర మహా చండీయాగం విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారి సమక్షంలో ప్రారంభం కానుంది. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరగనున్న యాగంలో ముఖ్యమంత్రి దంపతుల పాల్గొంటారు. ముందుగా గోపూజ చేసిన తరవాత యాగం ప్రారంభం అవుతుంది.
యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇప్పటికే యాగశాలకు చేరుకున్నారు. యాగంలో పాల్గొననున్న కర్ణాటక శృంగేరి పీఠం నుంచి యాగానికి వేద పండితులు హాజరు కానున్నారు.