తెలంగాణలో ‘కేసీఆర్ ఫ్యామిలీ రాజ్’

Mla

తెలంగాణలో ‘కేసీఆర్ ఫ్యామిలీ రాజ్’.

మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్;

హైదరాబాద్;

ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే కేసీఆర్ తన కుటుంబ రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చుకున్నట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మండిపడ్డారు. ఆయన ఆదివారం ఇక్కడ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధి జరగలేదని కేసీఆర్ కుటుంబమే లాభపడిందన్నారు. కేసీఆర్ కుంటుంబ నియంతృత్వపాలన పాలన సాగుతున్నట్టు ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణాలో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ ముందస్తు కు ఎందుకు వెళ్లారని మహారాష్ట్ర సీఎం ప్రశ్నించారు. దళితుడ్ని తెలంగాణ తొలి సీఎం చేస్తానని దళితుల ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించలేదని మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ విమర్శించారు.
సిరిసిల్లలో ‘సాండ్ మాఫియా’ తో దళితులను కెసిఆర్ సర్కార్ చిత్రహింసలు పెట్టించింది ఆయన ఆరోపించారు. ఉపాధి కల్పించడంలో కేసీఆర్ విఫలమవడంతో నిరుద్యోగ యువతీ, యువకులు రగిలిపోతున్నట్టు పృథ్వీ రాజ్ అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ను పక్కన బెట్టారని విమర్శించారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవడం సిగ్గుమాలిన చర్యగా పృద్వీ రాజ్ మండిపడ్డారు. మద్దతు ధరను అడిగిన రైతుల కు బేడీలు వేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిర్లజ్జగా లూటీ చేస్తున్నట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. కమిషన్ లకోసం ప్రాజెక్టు రీడిజైన్ లు చేశారన్నారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ ఒక ‘నయా నవాబ్’ అని విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని దేమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న ప్రతి హామీని అమలు చేసి చూపుతామని చెప్పారు. రైతులు ,యువత ,ఉద్యోగాలు ,మహిళలకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకుంటాం అని ఆయన తెలిపారు. బిజెపితో టీఆరెస్ రహస్య ఒప్పందం చేసుకున్నట్టు ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మాహారాష్ట్ర లో ముంపు అభ్యంతరాలపై తాను నాటి సీఎం కిరణ్ తో చర్చించినట్టు మహారాష్ట్ర మాజీ సీఎం గుర్తు చేశారు. చర్చల ద్వారా ఇరు రాష్ట్రాలు ఆనాడే ఆమోదయోగ్య అంగికారానికి వచ్చామని కూడా పృథ్వీరాజ్ చౌహాన్ తెలియజేశారు.