ఇరుగు పొరుగుతో సదా కరచాలనం!!

ఇరుగు పొరుగుతో సదా కరచాలనం!!
27 న తెలంగాణలో ఏపీ
ఇరిగేషన్ అధికారులపర్యటన.
– కేసీఆర్.

Hyderabad:

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగుతాయని ఎలాంటి కయ్యానికి దిగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఉండాల్సిన సంబంధాలపై క్యాబినెట్ లో చర్చ జరిగిందన్నారు.ఆంద్రప్రదేశ్ తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు.”గతంలో మహారాష్ట్ర, కర్ణాటక తో అంతులేని వివాదాలు జరిగేవి.కానీ మహారాష్ట్ర, కర్ణాటకతో ఇప్పుడు మంచి సంబంధాలు కొన
సాగుతున్నాయి. త్రాగు నీటి అవసరాల కోసం మనకు నీళ్లు ఇచ్చారు. గతంలో ప్రాజెక్ట్ ల విషయంలో కర్ణాటక మనకు మంచి సహకారాన్ని అందిస్తుంది.ప్రపంచం అబ్బురపడే విదంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు పూర్తి అవుతుంది. స్నేహ పూర్వ ధోరణి లో ఇరు రాష్ట్రాలు సహకారంతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంది.పరిశ్రమలకు,త్రాగునీరు కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఇరు రాష్ట్రాల సీఎం లను ఆహ్వానించడం జరిగింది.
ఈనెల 27 న తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఉంది.తరువాత విజయవాడలో కూడా సమావేశం అవుతాము.
గతంలో ఎన్నడూ లేని విదంగా ఇప్పుడు పాలన ఉండబోతోంది.ఎపి ప్రభుత్వం మనకు రావాల్సిన భవనాలు ఇప్పటికే పూర్తి అయింది. రేపు పూర్తి గా అందిస్తారు.సచివాలయం,అసెంబ్లీ భవనాలు నిర్మించాలని నిర్ణయించాం.సచివాలయం ఉన్న చోటనే నిర్మిస్తాం.5 నుండి 6 లక్షల ఎస్ ఎఫ్ టి నిర్మాణము కోసం 400 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అసెంబ్లీ భవనం కూడా మరో 100 కోట్లు అవుతుంది. పార్లమెంట్ భవనాల తరహా నిర్మాణం నిర్మించాలని చూస్తున్నాం.ఎర్రమంజిల్ లో అసెంబ్లీ భవనాన్ని నియించాలని నిర్ణయించాం.ఇప్పుడు ఉన్న అసెంబ్లీ భవనం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నిర్మించే అసెంబ్లీ భవనం కూడా అదే తరహా ఉంటుంది.
సచివాలయంలో ఉన్న అన్ని భావనలు కులగొట్టాల లేక ఉంచాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాలి.ఇప్పుడు నిర్మించే భవనం అద్భుతమైన నిర్మాణం జరుపుతాం.ఈనెల 27 న సచివాలయం శంకుస్థాపన చేస్తాము.కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ మాత్రమే. కానీ నీళ్లు మాత్రము జులైలో వస్తాయి.ఆర్&బి మంత్రి ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశాం. కమిటీ నిర్ణయం కు ముఖ్యమంత్రి కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం.ప్రభుత్వం ఉద్యోగుల సంబంధించిన పీఆర్సీ పై మరో సమావేశంలో చర్చిస్తాం.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉద్యోగుల రిటైర్మెంట్పై ఏజ్ పెంచే విషయంపై ఉద్యోగుల తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై చర్చించాం.పంచాయతీ రాజ్ సంస్థలు అన్ని క్రియాశీలం చెయ్యాలని నిర్ణయం.వారికి ఎలాంటి వి అప్పగించాలి అనేదానిపై వచ్చే క్యాబినెట్ లో చర్చిస్తాం.మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలో నే జరుపుతాం.కొత్తగా చాలా మున్సిపాలిటీ లు వచ్చాయి దీనికి సంబంధించిన చట్టంపై కూడా చర్చించాం.వెంటనే రిజర్వేషన్ల పక్రియ ముగిసిన తరువాత జులై లో ఎన్నికలు జరిగే లా నిర్ణయం తీసుకుంది.దర్శకుడు ఎన్ శంకర్ కు మొకీల లో సినిమా స్టూడియోకు ఎకరాకు 5 లక్షలు చొప్పున 5 ఎకరాలు కేటాయింపు జరిగింది. శారదా పీఠం కు కూడా 2 ఎకరాలు కేటాయింపు జరిగింది. వారు పాటశాల నిర్మిస్తాం అన్నారు.టీఆరెస్ పార్టీ కి కూడా 31 జిల్లాలకు జాగలు కేటాయింపు జరిగింది.వరంగల్ రూరల్ ,సిటీ మినహా అన్ని జిల్లాకు స్థలాలు కేటాయింపు జరిగింది.
పార్టీ భవనాల నిర్మాణం పై రేపు పార్టీ మీటింగ్ రేపు జరుగుతుంది దానిపై చర్చిస్తాం.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర, ఎపి ముఖ్యమంత్రులు వస్తున్నారు.కాళేశ్వరం దగ్గర హోమం జరుగుతుంది.ఇది చాలా సంతోషం ,తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. దుష్టశక్తులు ప్రాజెక్టును ఆపాలని పన్నాగం పన్నారు. కానీ చాలా చక్కగా ముందుకు వెళ్ళాం.ఓపెనింగ్ కు మంచిరోజులు ఈ నెల తప్పితే మళ్ళీలేదు. అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాం.దీన్ని ఎదో చేసి మాట్లాడుతున్నారు,విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని వెళ్తే మీరు రావద్దు అని లేఖలు రాస్తారా?మీరు 50 సంవత్సరాలు పాలించి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేదు.ప్రపంచంలో అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్.
దీన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు,200 పైగా కేస్ లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది.కొత్త రాష్ట్రానికి ఒక్క గొప్ప వరం,కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు.భారీ 17 సబ్ స్టేషన్స్ నిర్మాణము చేశాం.గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సబ్ స్టేషన్ నిర్మాణం జరుగలేదు.విద్యుత్ నాణ్యమైన విద్యుత్ అందిస్తాం అన్నాం అందించాం.
రాష్ట్రంలో బిందెలు ఎక్కడ కనిపించవు అన్నాం అయిపోయింది.కోటి పై చిలుక ఎకరాలకు నీళ్లు అంధించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణము చేపడుతాం
ప్రతి దానికీ ప్రదాన్ని పిలువాల్సిన అవసరం లేదు.
అన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేదు.మోడీ తో ఎప్పుడు కూడా బంధం కొనసాగించలేదు. మాకు నచ్చిన చోట కేంద్రానికి మద్దతు ఇచ్చాము నచ్చని చోట గట్టిగా ఆడిగాం.నీతి ఆయోగ్ ను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కు కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.అన్ని రికార్డులు ఉన్నాయి.ప్రాజెక్ట్ లకు కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వాల్సిందే” అని కేసీఆర్ చెప్పారు.