కోహ్లీ అవుట్‌!

కోహ్లీ అవుట్‌!
kohli out

న్యూఢిల్లీ:

అర్ధ‌శ‌త‌కానికి చేర‌వవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఆస్ట్రేలియా బౌల‌ర్‌ రిచ‌ర్డ్స‌న్ భార‌త్‌కు షాకిచ్చాడు. 46 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద కోహ్లీ రిచ‌ర్డ్స‌న్ బౌలింగ్‌లోకారేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 54 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌పడింది. రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌ను ధోనీతో క‌లిసి కోహ్లీ మ‌రోసారి ఆదుకున్నాడు. మ‌రోవైపు ధోనీ (38 నాటౌట్‌) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కోహ్లీ స్థానంలో జాద‌వ్ (1 నాటౌట్‌) క్రీజులోకి వ‌చ్చాడు.. దీంతో భార‌త్ ప్ర‌స్తుతం 31 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 117 ప‌రుగులు చేసింది. విజ‌యానికి మ‌రో 114 పరుగుల దూరంలో ఉంది.