కేసీఆర్ సర్కార్ దాచిపెట్టిన జీవోలెన్నో !!

హైదరాబాద్:
ప్రజా ప్రబుత్వం… అని గొప్పలు చెప్పుకునే నేతలు, తమ నిర్ణయాలను… ఏం చేస్తున్నారు, చేయబోతున్నారో ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం. గతంలో అంటే 2014 ముందు సచివాలయం కేంద్రంగా నడిచిన పాలనలో ప్రభుత్వ నిర్ణయాలు అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవి. తద్వారా జవాబుదారీతనం ఉంటుంది అన్నది దాని ఉద్దేశం. కేసీఆర్ సర్కార్ వచ్చాక, కొంతకాలం గడిచాక… సగానికి పైగానే రహస్య జీవోలతో ప్రబుత్వాన్ని నడిపించారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.కేటీఆర్ మంత్రిగా పనిచేసిన మున్సిపల్ శాఖలో 2017లో కనీసం ఒక్క జీవో అంటే ఒక్క జీవో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. తుమ్మల ఆద్వర్యంలోని రోడ్లు భవనాల శాఖలో కేవలం 8 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారంటే ఎంతమేర మన ప్రబుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవచ్చు.2016 సంవత్సరంలో… 9951 జీవోలను రహస్య జీవోలుగా ఉంచిన ప్రభుత్వం, 2017లో ఏకంగా ఆ సంఖ్యను 11918కు చేర్చిందంటే అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రబుత్వం వచ్చాక మొత్తం దాదాపు 22వేల జీవోలను ఇంతవరకు బహిర్గతపర్చకుండా
ఉన్నది.వందశాతం పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఓవరాల్ గా 42శాతం పారదర్శకత మెయింటెన్ చేసింది. ఇంటర్నల్ ఆర్డర్స్ పేరుతో కేసీఆర్ నడిపిన ఈ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వచ్చాక,2014లో 10283 జీవోలు ఇవ్వగా, అన్నీ బహిర్గత పర్చారు.2015లో 21702 జీవోలు ఇవ్వగా, అన్నీంటినీ బహిర్గత పర్చారు.2016లో 23115జీవోలు ఇవ్వగా, 13,164జీవోలను బయటపెట్టి… 9951జీవోలను రహస్యంగా ఉంచారు.2017లో 20614 జీవోలు ఇవ్వగా, 8696జీవోలు బయటపెట్టి… 11,918 జీవోలను రహస్యంగా ఉంచారు. 2016,2017లో కేసీఆర్ సచివాలయానికి రాకపోగా, ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు అర్థమవుతోంది. గతంలో ఇలా ఏ ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు. కొన్ని రోజులైతే… కోర్టు మెట్లు ఎక్కే వరకు ప్రజలకు జీవోలనే అందుబాటులో లేకుండా కూడా చేశారు.