‘జన గంగ’!! కుంభమేళాలో కోట్ల మంది పుణ్య స్థానం!

‘జన గంగ’!!

కుంభమేళాలో కోట్ల మంది పుణ్య స్థానం!
kumbhmela 2019

అలహాబాద్:

హర్ హర్ గంగే .కుంభమేళాకు పోటెత్తినజనం.తొలి రెండు రోజుల్లో 2.2 కోట్ల మంది పుణ్యస్నానాలు .అట్టహాసంగా ప్రారంభమైన ఆధ్యాత్మిక వేడుక .అట్టహాసంగా ప్రారంభమైన కుంభమేళా .2 రోజుల్లో 2.2 కోట్ల మంది పుణ్యస్నానాలు .అఖారాలు, నాగ సాధువులు, స్వామిజీల సందడి -జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం .అడుగడుగునా అఖారాలు, నాగ సాధువులు, స్వామిజీల సందడి -కిటకిటలాడిన త్రివేణి సంగమం .జన జాతరకు రూ.4,200 కోట్లు కేటాయించిన యూపీ సర్కారు.
భారీ ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగ అట్టహాసంగా ప్రారంభమైంది. నాగ సాధువుల ఓంకార నాదాలు, సాధుసంతుల నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆధ్యాత్మిక నగరి అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) హోరెత్తింది. హర్ హర్ గంగే నినాదాలతో దద్దరిల్లింది. కోట్లాది మంది భక్తుల రాకతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన పావన త్రివేణి సంగమం కిటకిటలాడింది. ఈ వేడుకల నిర్వహణకు యూపీ సర్కారు రూ.4,200 కోట్లు కేటాయించింది. తొలి రోజైన మంగళవారం, బుధవారాల్లో 2.2 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్‌కు చెందిన కిన్నెర అఖారాను స్నానాలు చేసేందుకు అనుమతించారు. విదేశాలకు చెందిన 172 మంది ప్రతినిధులు ఈ వేడుకను తిలకించేందుకు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జనవరి 15న మొదలైన ఈ జన జాతర మార్చి 4వరకు సుమారు 50 రోజులపాటు కొనసాగనున్నది.నాగ సాధువుల ఓంకార నాదం, సాధుసంతుల నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆధ్యాత్మిక నగరి అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) హోరెత్తింది. హర్ హర్ గంగే నినాదాలతో దద్దరిల్లింది. కోట్ల మంది భక్తుల రాకతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన పావన త్రివేణి సంగమం కిటకిటలాడింది. దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. స్వామీజీల నుంచి సాధారణ భక్తుల వరకూ అంతా అక్కడికే క్యూ కట్టారు. పుణ్య స్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కాషాయ ధ్వజాలతో నగర వీధులన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 15న మొదలైన ఈ జన జాతర మార్చి 4 వరకు సుమారు 50 రోజులు సాగనున్నది. కుంభమేళాకు వచ్చే భక్తజనం కోసం సంగమం వద్ద కుంభ్‌నగరి పేరుతో ప్రత్యేక కుటీరాలు నిర్మించారు.గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయకుండా సూర్యోదయానికి ముందే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా తొలి రోజు మంగళవారం రికార్డు స్థాయిలో భక్తులు త్రివేణి సంగమంలో షాహీ (రాజయోగ) పుణ్యస్నానాలు చేశారు. మంగళ, బుధవారాల్లో మొత్తం 2.2 కోట్ల మంది స్నానమాచరించి నట్లు అంచనా.ప్రఖ్యాతిగాంచిన 13 అఖారాల సాధువులు (శైవ-7, వైష్ణవ-3, ఉదాసిన-2, సిక్కు-1) తమ భక్తజన బృందం తో వేలాదిగా తరలివచ్చి స్నానం చేశారు. వాయిద్యాల హోరు లో నృత్యాలతో ఆయుధాలు ప్రదర్శిస్తూ సందడి చేశారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు ఒక్కో అఖారాకు యూపీ సర్కార్ 45 నిమిషాలు కేటాయించింది. పురాతన, అతి పెద్ద అఖారా జునా అఖారా తొలి స్నానం ఆచరించింది. బుధవారం సుమారు కోటి మందికిపైగా భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా జునా అఖారా అధ్యక్షుడు మహంత్ హరిగిరి మాట్లాడుతూ.. మకర సంక్రాంతి పర్వదినం మాకు ఎంతో పవిత్రమైంది. ఇక్కడి నుంచి చలి తగ్గి భానుడి ప్రకాశం పెరుగుతుంది. ప్రకృతి సరికొత్త శోభను సంతరించుకుంటుంది. భగవంతుడి ఆశీస్సులు అందరికీ లభిస్తాయి అని పేర్కొన్నారు. శతాబ్దాల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించడం గర్వకారణమని యూపీ దేవాదాయ మంత్రి లక్ష్మినారాయణ్ చౌధరీ చెప్పారు. 350 ఏండ్ల క్రితం హిందూ సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రయాగ కేంద్రంగా ఉండేది. కానీ, ఆ తర్వాత నాటి పాలకులు ఈ నగరం పేరు అలహాబాద్‌గా మార్చారు. కానీ, గత ఏడాది యూపీ సీఎం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ అని మార్చారు. వేదాల్లోనూ ప్రయాగ ప్రస్తావన ఉంది. కుంభమేళాను ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక, వారసత్వ వేడుకగా 2017లో యునెస్కో గుర్తించింది అని అన్నారు. ఈ జాతరను తిలకించేందుకు 172 దేశాల ప్రతినిధులు హాజరవుతారని మంత్రి చెప్పారు. కుంభమేళాకు యూపీ సర్కారు అసాధారణ ఏర్పాట్లు చేసింది. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని నియమించింది. వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, 40వేల ఎల్‌ఈడీ లైట్లు, 11వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో స్వచ్ఛ కుంభ్ దళాన్ని ఏర్పాటు చేసింది. సుమారు లక్షకుపైగా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించింది. 20వేలకు పైగా చెత్తను సేకరించే డబ్బాలు, 2వేల మందితో స్వచ్ఛ పదాతిదళాన్ని నియమించింది. శతాబ్దాల అనంతరం తొలిసారిగా అలహాబాద్ కోటలోని అక్షయ్ వత్ వృక్షం, సరస్వతి కూప్ (బావి)ని దర్శించుకునేందుకు అనుమతించారు. ఇందులో సరస్వతి నది జలాలు కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గతంలో 12 ఏండ్లకోసారి జరిగే మేళాను కుంభమేళాగా పిలిచేవారు. ఆరేండ్లకోసారి జరిగే వేడుకను అర్ధ కుంభమేళాగా వ్యవహరించేవారు. అయితే, యూపీ సీఎం ఆదిత్యనాథ్ వీటికి సరికొత్త పేర్లు పెట్టారు. 12 ఏండ్లకోసారి జరిగే కుంభమేళాను మహాకుంభమేళాగా, ఆరేండ్లకోసారి జరిగే అర్ధ కుంభమేళాను కుంభ్/కుంభమేళాగా ప్రకటించారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోనూ కుంభమేళాగానే పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వేడుక అర్ధ కుంభమేళా. 2013లో త్రివేణిసంగమంలో మహాకుంభమేళా జరిగింది. ప్రపంచంలోనే ఇది గొప్ప ఆధ్యాత్మిక వేడుకని, తన జీవితంలో ఇంతమందిని ఒకేసారి, ఒకే వేదికపై చూడలేదని జర్మనీకి చెందిన మాన్యూల్ మాథ్యూస్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కుంభమేళా చరిత్రలో తొలిసారి ట్రాన్స్‌జెండర్స్ (లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తుల)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిన్నెర అఖారాకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడంతోపాటు, స్నానాలకూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కిన్నెర అఖారా అధ్యక్షుడు మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి ఉబ్బ తబ్బిబయ్యారు. ఇది మా చరిత్రలోనే సువర్ణా ధ్యాయం. ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కులకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. మాకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించేందుకు అంగీకరించిన జునా అఖారాకు కృతజ్ఞతలు అని చెప్పారు. సుమారు 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా.ఆధ్యాత్మికతకు ఖండాలు అడ్డుకావని నిరూపించాడు ఆస్ట్రేలియా సాధువు శ్రావణ్ గిరి. సన్యాసిగా మారాక తన పేరును శ్రావణ్‌గిరిగా మార్చుకున్నారు. ప్రతి కుంభమేళాకు ఆయన తప్పకుండా భారత్‌కు వచ్చి నెలలపాటు ఇక్కడే ఉంటాడు. 1998లో తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం నచ్చి అనూహ్యంగా ఆయన సాధువుగా మారాడు. గుజరాత్‌లోని గిర్నార్ కొండల్లో కొలువైన దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాక పూర్తిగా ఆధ్యాత్మికత బాటపట్టాడు. అనంతరం హిమాలయాలకు వెళ్లి కొంతకాలం గురువు మార్గదర్శకత్వంలో తపస్సు చేశాడు. ఆ తర్వాత జునా అఖారాలో సభ్యుడయ్యాడు. ఆస్ట్రేలియాలో తన ఇంటి ఆవరణలోని కుటీరంలో శ్రావణ్‌గిరి సాధు జీవితం గడుపుతుంటారు.కుంభమేళా నిర్వహణకు యూపీ సర్కారు రికార్డు స్థాయిలో రూ.4,200 కోట్లు కేటాయించింది. 2013లో జరిగిన మహాకుంభమేళాకు కేటాయించిన మొత్తంతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. మహా కుంభమేళాకు గత సర్కార్ రూ.1,300 కోట్లు కేటాయించింది. కానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏకంగా రూ.4,200 కోట్లు విడుదల చేశారు. గతంలో త్రివేణి సంగమం ఒడ్డున 3,953 ఎకరాల్లో భక్తులకు వసతి, ఇతర ఏర్పాట్లు చేయగా, ఈ దఫా 7,907 హెక్టార్లలో సకల వసతులు కల్పించాం అని యూపీ ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్ చెప్పారు. మరోవైపు కుంభమేళాకు హిందీయేతర రాష్ర్టాల భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైళ్ల రాకపోకల వివరాల్ని గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తెలియజేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు, ఒరియా, బెంగాలీ భాషలను కూడా త్వరలో ఈ జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
నాగ సాధువులు కుంభమేళా సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. ఈ అలంకరణ కొత్త పెళ్లి కూతురు తరహాలో ఉంటుంది. దీన్ని 17 శింగర్ అని పిలుస్తారు. నాగ సాధువులు మకర సంక్రాంతి (జనవరి 15), పౌష్ పూర్ణిమా (జనవరి 21), మౌని అమావాస్య (ఫిబ్రవరి 4), వసంత పంచమి (ఫిబ్రవరి 10), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 19), మహాశివరాత్రి (మార్చి 4) పర్వదినాల్లో ప్రత్యేకంగా షాహీ స్నానాలు చేస్తారు. ఈ సందర్భాల్లో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. ఇది అధ్యాత్మికంగా, భౌతికంగా తమను తాము శుద్ధి చేసుకోవడమని వారు భావిస్తారు. ఆ తర్వాత ఒళ్లంతా బూడిద రాసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. షాహీ స్నానాలకు ముందు రోజు నాగ సాధువులు తమ దైవాన్ని ప్రార్థిస్తూ రాత్రంతా పూజలు చేస్తారు.