మన రాష్ట్రం- మన ‘సర్వే’ లు!!

ఈ ‘పొత్తుల’ ను ప్రజలు ఆమోదిస్తారా? లేదా ? అనే సందేహాలు ఎలా ఉన్నా ‘కూటమి’ పటిష్టంగా ఉంటె తమకు గట్టి పోటీ తప్పదని కేసీఆర్, కేటీఆర్ కు తెలుసు. అందువల్ల ఆ కూటమి ఏర్పాటునే వారు వ్యతిరేకిస్తున్నారు. టిడిపి ఆంధ్రా పార్టీ కనుక ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్లేనని కొందరు టిఆర్ఎస్ ప్రముఖుల వాదన. టిడిపి ఆంధ్రాపార్టీయే కావచ్చు కానీ ఆ పార్టీ తరపున తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన వ్యక్తులు, టిడిపి అభ్యర్థులు గా పోటీ చేస్తే ‘తెలంగాణ ద్రొహులు’ ఎట్లాఅవుతారో!! తెలియదు. టిడిపితో జత కడితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ‘కళంకితుల’ య్యే ప్రమాదమూ లేకపోలేదు. ‘కూటమి’ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రధాన స్రవంతి మీడియాలో ఇలాంటి ప్రచారం జూలువిదిల్చనున్నది.అత్యంత శక్తిమంతునిగా తయారైన కేసీఆర్ ను ఓడించడం తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదని ‘నిర్ధారించుకున్న’ కాంగ్రెస్ ఇతర రాజకీయపక్షాలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్, టిడిపి పొత్తులు ఫలించగలవా? వికటిస్తాయా? అన్నది మరో కోణం. ఫలితాల తర్వాతే తేటతెల్లం కాగలదు. పొత్తుల వల్ల ‘లాభనష్టాల’ను బేరీజు వేయడంలో ఎవరి అంచనాలు వారికున్నవి. లాభమని కొందరు నష్టమని కొందరు వాదిస్తున్న వాళ్ళున్నారు. ఎవరి దృక్పథం వారిది.

 

ఎస్.కె.జకీర్.

తెలంగాణాలో కేసీఆర్ కు తిరుగులేని ఆధిక్యత రాబోతున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ‘ఫ్లాష్’ సంస్థ మెరుపు సర్వేతో తేల్చి పారేసింది. అంతకు ముందు ‘ఆజ్తక్’ అనే హిందీ న్యూస్ ఛానల్ కూడా ఇలాంటి సర్వేను వెల్లడించింది. ఈ సర్వేలు ఇంత ‘ముందస్తు’ గా జరిపి, అత్యంత వేగంగా ‘ఫలితాల’ను కూడా ప్రకటించడం వెనుక కారణాలు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. ఆయా సర్వేల హేతుబద్ధత, శాస్త్రీయత, విశ్వసనీయత పై సహజంగానే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతున్నది. ‘ఫ్లాష్’ సర్వే పేరిట వెలువడిన ఫలితాలను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటి ప్రసారం చేసింది. ఆ న్యూస్ ఛానల్, ఫ్లాష్ సంస్థ సంయుక్తంగా ‘సర్వే’ జరిపినట్టు చెప్పుకున్నది. టిఆర్ఎస్ 95 కు పైగా అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోబోతున్నట్టు ‘ఫ్లాష్’ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కి ఆ సంస్థ ఎంతో ‘ఉదారంగా’ 15సీట్లను ఇచ్చింది. టివీ5 న్యూస్ ఛానల్ ‘ఫ్లాష్’ సర్వే ఫలితాల ప్రసారానికి ముందు ‘లగడపాటి సర్వే’ పేరుతొవాట్సాప్ గ్రూపుల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేల్లో ‘నిష్ణాతుడు’. ఆయన సర్వేలు ఇప్పటిదాకా ఎక్కడా అంచనా తప్పలేదు. ఆ ట్రాక్ రికార్డు లగడపాటికి ఉన్నది. కనుక లగడపాటి సర్వే అంటే వచ్చే క్రేజ్ వేరు. అందువల్ల లగడపాటి సర్వే పేరుతో సదరు న్యూస్ ఛానల్ సిబ్బంది ప్రచారాన్ని ఊదరగొట్టారు. తీరా అది ‘ఫ్లాష్’ అనే సంస్థకు సంబంధించినదిగా ఆ తర్వాత బయటపడింది. లగడపాటి సర్వే ఫలితాలంటూ కొద్దీ రోజుల క్రితం ఒక కథనం, అంకెలు సామాజిక మాథ్యమాల్లో దుమ్ము రేపాయి. అందులో కాంగ్రెస్ కు 61, టిఆర్ఎస్ కు 39 సీట్ల పంపిణీ జరిగింది. దాని విశ్వసనీయతపై అందరికీ అనుమానాలు వచ్చాయి. ఆ సర్వే తాను చేయించలేదంటూ లగడపాటి స్వయంగా ఖండించవలసి వచ్చింది. అసలు లగడపాటి సర్వే చేయించారా? లేదా? చేయిస్తే దాని ‘అవుట్ కమ్’ ఏమిటన్న ప్రశ్నలు ఉన్నవి. సర్వే జరిపించినా ఆయన ఆ వివరాలు వెల్లడించేందుకు సుముఖంగా ఉండకపోచ్చును. మరో వైపు తాము ఇంకా సర్వే చేయించలేదని లగడపాటి చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్నితెలంగాణ అంతటా ప్రజలు ఆమోదిస్తున్నట్టు ‘ఫ్లాష్’ చెబుతున్నది. 70 శాతానికి పైగా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నట్టు ఆ సంస్థ కథనం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టిఆర్ఎస్ దూసుకుపోతున్నదని, 95సీట్లను అధికార పార్టీ క్రాస్ చేయవచ్చునని ‘ఫ్లాష్’ తేల్చింది. మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని 58 శాతం ప్రజలు కోరుకుంటున్నట్టు ‘ఫ్లాష్’ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిపోయిందని, ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఎలాంటి అస్త్రాలు లేవని టిఆర్ఎస్ అభిమానులు చెబుతున్నారు. టిఆర్ఎస్ ఊపుతో పోల్చితే కాంగ్రెస్ దారుణమైన ఓటమికి చేరువలో ఉన్నట్టు అప్పుడే టిఆర్ఎస్ సొంత మీడియా సంస్థల్లో, లేదా అధికారపార్టీ మిత్ర పత్రికల్లో, అనుకూల మీడియాలో వార్తా కధనాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నవి. ‘ఫ్లాష్’ చేసిన సర్వే ఫలితాలు ప్రాక్టికల్ గా పోలింగు నాటికి ప్రతిఫలిస్తాయా? లేదా అన్నదే సందేహం. అటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పోల్చితే చాలా విషయాల్లో వెనుకబడిపోయిన మాట నిజం. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు. ఒంటి చేత్తో వ్యవహారాలు సాగవు.

ఢిల్లీ స్థాయిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. పైగా అత్యంత శక్తిమంతునిగా తయారైన కేసీఆర్ ను ఓడించడం తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదని ‘నిర్ధారించుకున్న’ కాంగ్రెస్ ఇతర రాజకీయపక్షాలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్, టిడిపి పొత్తులు ఫలించగలవా? వికటిస్తాయా? అన్నది మరో కోణం. ఫలితాల తర్వాతే తేటతెల్లం కాగలదు. పొత్తుల వల్ల ‘లాభనష్టాల’ను బేరీజు వేయడంలో ఎవరి అంచనాలు వారికున్నవి. లాభమని కొందరు నష్టమని కొందరు వాదిస్తున్న వాళ్ళున్నారు. ఎవరి దృక్పథం వారిది. అయితే ఈ ‘పొత్తుల’ ను ప్రజలు ఆమోదిస్తారా? లేదా ? అనే సందేహాలు ఎలా ఉన్నా ‘కూటమి’ పటిష్టంగా ఉంటె తమకు గట్టి పోటీ తప్పదని కేసీఆర్, కేటీఆర్ కు తెలుసు. అందువల్ల ఆ కూటమి ఏర్పాటునే వారు వ్యతిరేకిస్తున్నారు. టిడిపి ఆంధ్రా పార్టీ కనుక ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్లేనని కొందరు టిఆర్ఎస్ ప్రముఖుల వాదన. టిడిపి ఆంధ్రాపార్టీయే కావచ్చు కానీ ఆ పార్టీ తరపున తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన వ్యక్తులు, టిడిపి అభ్యర్థులు గా పోటీ చేస్తే ‘తెలంగాణ ద్రొహులు’ ఎట్లాఅవుతారో!! తెలియదు. టిడిపితో జత కడితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ‘కళంకితుల’ య్యే ప్రమాదమూ లేకపోలేదు. ‘కూటమి’ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రధాన స్రవంతి మీడియాలో ఇలాంటి ప్రచారం జూలువిదిల్చనున్నది. 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ 34 శాతం అంటే 66, 18, 972 లక్షల ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 25 శాతం అంటే 48,64,808 ఓట్లు సాధించింది. అప్పుడు టీడీపీ-బీజేపీకి పొత్తు ద్వారా 21 శాతం ఓట్లు లభించినవి. టిడిపి కి 15 శాతం 28,28,492 ఓట్లు లభించాయి. దీనిప్రకారం ప్రస్తుతం టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ద్వారా సాధించే ఓటింగ్ 40 శాతం అవుతుందని ఒక అంచనా. ఇది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన ఓట్లకంటే ఎక్కువ . ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగున్నరేళ్లలో మూటకట్టుకున్న యాంటీ ఇంకంబెన్స్ ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్‌ కన్నా ముందు ఉంటామనికనీసం 80 సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంచనా కొచ్చింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కూటమి మేలని భావిస్తే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు కచ్చితంగా కాంగ్రెస్ కూటమికే దక్కాలి. కానీ ప్రస్తుతం టీడీపీ బాగా బలహీన పడిందనుకుందాం. ఎంత బలహీన పడినా, గతంలో వచ్చిన 15 శాతం ఓట్లు రాకపోయినా, 9శాతమో,10శాతమో ఓటింగ్ దక్కినా కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశం కానున్నది. ఈ పొత్తువల్ల కాంగ్రెసు కూటమి గెలుస్తుందన్న విశ్వాసం ప్రజల లోకి బలంగా తీసుకువెళ్లగలిగితే . టీఆర్ఎస్ లో చేరిన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి రావచ్చును. అలాంటి విశ్వాసం ఓటర్లలో కల్పించడంలో టీడీపీ అడుగు ముందుకువేసిందనే చెప్పవచ్చు. బిజెపి ఒంటరిగా బరిలోకి దిగుతున్నందున కాంగ్రెస్ – టీడీపీపొత్తుసంకేతాలతో దాదాపు 25 సీట్లలో త్రిముఖపోటికిఅవకాశాలున్నవి.