10 లక్షలమందికి నిరుద్యోగ భ్రుతి అమరావతి:మంత్రి నారా లోకేష్

నిరుద్యోగ భృతి పై కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ గురువారం ప్రకటించారు.10లక్షల మంది యువత కు నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కనీస విద్యార్హత డిగ్రీ గా పరిగణిస్తున్నామని లోకేష్ వివరించారు.హేతు బద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని,కట్టు బట్టలతో మనల్ని బయటకి గెంటేసారని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నట్టు మంత్రి లోకేష్
తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వలన మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ ఒన్ గా ఉన్నామణి అన్నారు.పార్టనర్ షిప్ సమ్మిట్స్ నిర్వహించడం ద్వారా పెద్ద ఎత్తున కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని తెలిపారు.”కియా లాంటి ఆటోమొబైల్ కంపెనీలు,ఐటీ,ఎలెక్ట్రానిక్స్ కంపెనీ లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి.పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తున్నాయి.
ఒక్క ఫాక్స్ కాన్ సంస్థ లోనే 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగ భృతి పై చర్చించాం.త్వరలోనే నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం.2018-19 బడ్జెట్ లో నిరుద్యోగ భృతి అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1000 కోట్లు కేటాయించారు.కేవలం భృతి ఇవ్వడమే కాదు వారికి నచ్చిన రంగాల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వబోతున్నాం.ఆన్ లైన్ లో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
22-35 ఏళ్ల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.దారిధ్యరేఖ(below poverty line) కు దిగువున ఉన్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం.సుమారుగా సంవత్సరానికి 1200 కోట్ల రూపాయిలు ఈ కార్యక్రమం అమలుకు ఖర్చు చెయ్యబోతున్నాం.నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారిని సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చెయ్యబోతున్నాం.” అని మంత్రి లోకేష్ తెలిపారు.