ప్రజాస్వామ్య తెలంగాణ’ పై లండన్ లో సమావేశం.

London

లండన్:

లండన్ లో ‘ప్రజాకూటమి’ లో భాగస్వామ్యమైన కాంగ్రెస్ ,తెలుగు దేశం , తెలంగాణ జన సమితి పార్టీ ల ఎన్నారై శాఖల ఆధ్వర్యం లో సమావేశం జరిగింది.తెలంగాణ ఎన్నికల్లో 30 రోజుల కార్యాచరణ , కేత్రస్థాయి లో అందుబాటులో ఉండే ఎన్నారై ల తో గల్ఫ్ భరోసా యాత్ర ,కరపత్ర ప్రచారం , యువత ,విద్యార్థి తో సమావేశాలు , బహిరంగ సభల్లో ఎన్నారై ల తరపున ప్రచారం, సోషల్ మీడియా లో ప్రచారం అలాగే లండన్ లో భారీ బహిరంగ సభ తదితర అంశాల పై చర్చించారు .
గంప వేణుగోపాల్ ( కన్వీనర్ .టీపీసీసీ ఎన్నారై సెల్ , టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు ):
తెలుగు దేశం ,సిపిఐ , తెలంగాణ జన సమితి ల పొత్తు పై ఎటువంటి సందేహం వలదని ,దారులు వేరైనా గమ్యం ఒక్కటే. తెలంగాణ ప్రజలకు ఇప్పుడున్న లక్యం ఒక్కటే ఏకోన్ముఖం గ ప్రయాణించి నియంతృత్వ తెరాస ప్రభుత్వానికి చరమగీతం పాడి దాని స్థానం లో రాజ్యాంగ బద్ద ,ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు . అప్పుడే అమరుల ఆత్మ కు శాంతి కలుగుతుందని అన్నారు . తానూ కూడా ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం తినే పెరిగిన అని అలంటి ప్రజా సంక్షేమ పథకాలు ఆలోచన తో ముందుకు వెళ్తామని అన్నారు .
జై కుమార్ గుంటుపల్లి ( అధ్యక్షులు తెలుగు దేశం యూకే &యూరోప్) :
రాబోయేది మహాకూటమి ప్రభుత్వమే నని ,కెసిఆర్ కు పాలించే హక్కు కోల్పోయారని మోడీ చేతి లో కీలుబొమ్మ లా ఆడుతున్నారని అన్నారు . 5 ఏండ్లు పాలించమని అధికారం ఇస్తే మధ్య లోనే వదిలేసి ప్రజల పై భారం మోపారన్నారు . కేజీ టు పిజి అని చెప్పి మోసం చేశారన్నారు. నిరంతర విద్యుత్తూ గత ప్రభుత్వాల ఘనతే నని అన్నారు. ఒక్క డిస్సిసి వేయకుండా ఖాళీ ఉపాధ్యాయ పోస్ట్ లు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కెసిఆర్ దే నని విమర్శించారు
రంగు వెంకట్ ( చైర్మన్ ,తెలంగాణ జన సమితి యూకే &యూరోప్ ) :
కెసిఆర్ , జయశంకర్ సార్ ఆశయాలను ,ఆశలను వొమ్ము చేశారని అన్నారు. 1200 మంది అమరవీరులను 350 మంది గ చూపడం హేయమని అన్నారు , అమరవీరులను ఆదుకోవడం లో విఫలం అయ్యారు ఉద్యమ వ్యతిరేకులతో కెసిఆర్ దర్బార్ నిండిపోయింది అని అన్నారు . ఉద్యోగ కల్పన ల విఫలం , మౌలిక సదుపాయాల్లో విఫలం ,నాణ్యమైన విత్తనాలు సరఫ చేయడం లో రైతులకు గిట్టుబాటు ధర లు కల్పించడం లో విఫలం , 2014 ఎన్నికల హామీల్లో 90% చేయకుండా మాట తప్పి మాయమాటల తో మోసం చేస్తున్న కెసిఆర్ కి పాలించే హక్కు లేదు అన్నారు .

Telanaga Meeting

రంగుల సుధాకర్ గౌడ్ ( టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు):
కాంగ్రెస్ లో పుట్టి టీడీపీ లో పెరిగి 2004 లో కాంగ్రెస్ తో 2009 లో టీడీపీ తో పొత్తు పెట్టుకొని ప్రజాస్వామ్య బద్ద కాంగ్రెస్ ,టీడీపీ పొత్తు పై కెసిఆర్ అవాకులు చెవాకులు నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు అని ఘాటుగా విమర్శించారు. ఒంటెద్దు పోకడలతో రాచరికాన్ని తలపిన తెరాస ప్రభుత్వం పోయి ప్రజాకూటమి వస్తుందని అన్నారు.

వేణు పోపూరి (తెలుగు దేశం ) :
కేంద్రం లో మోడీ ,తెలంగాణ లో కెసిఆర్ రెండు కూడా నియంతృత్వ ప్రభుత్వాలే దేశ చరిత్రలో రెండు ప్రభుత్వాలు మాయని మచ్చ వంటివి అని అన్నారు . మహాకూటమి ఏర్పాటు తో ప్రజల్లో కొత్త ఆశ చిగురించిందని డిసెంబర్ లో కొత్తగా ఏర్పడబోయేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని అన్నారు .నెల రోజులు పూర్తి ప్రణాళిక బద్దం గా అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం తీసుకొని 90 నియోజకవర్గాల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తరపున గంప వేణుగోపాల్ ,సుధాకర్ గౌడ్ , తిరుపారి నర్సింహా రెడ్డి లు టీడీపీ నుండి యూకే &యూరోప్ అధ్యక్షుడు గుంటుపల్లి జయ కుమార్ ,శ్రీకిరణ్ పరుచూరి ,వేణు పోపూరి ,నరేష్ మలినేని ,నవీన్ జవ్వాది ,శ్రీనివాస్ పాలడుగు ,ప్రసన్న నాదేండ్ల ,భాస్కర్ అమ్మినేని ,రమేష్ నాదేండ్ల , తెలంగాణ జనసమితి యూకే &యూరోప్ చైర్మన్ రంగు వెంకట్ కార్యదర్శిలు కూర రవి ,ఆకుల వెంకట్ స్వామి గౌడ్ లు పాల్గొన్నారు