మకర జ్యోతిని దర్శించుకున్న లక్షలాది భక్తులు

మకర జ్యోతిని దర్శించుకున్న లక్షలాది భక్తులు
sabarimala ayyapa makarajyothi darshan

శబరిమల అయ్యప్ప స్వామి సమక్షంలో లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకున్నారు. అపురూపమైన జ్యోతిని దర్శించుకున్న భక్తులంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే మకరజ్యోతిని దర్శించుకొనేందుకు భక్త జనసాగరం భారీ ఎత్తుల కదిలి వచ్చింది. మకలవిలుక్కు (మకర జ్యోతి) నిర్వహించేందుకు సుమారుగా 18 లక్షలకు పైగా భక్తులు నేడు శబరిమలకు హాజరయ్యారు. పొన్నంబల కొండపై వెలిగిన జ్యోతి భక్తులనను ఆనంద పరవశులను చేసింది.

సంప్రదాయాన్ని అనుసరించి సాయంత్రం 6.40 నిమిషాల తర్వాత మండల పూజ జరిగిన అనంతరం కొండపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనం కాగానే లక్షలాది భక్తులంతా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణు ఘోష చేశారు. మకరజ్యోతిని అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భక్తులు నమ్ముతారు. ఈ జ్యోతిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చారు.