మల్లన్నసాగర్ వెళ్లిన పౌరహక్కుల నేతల అరెస్టు!

Siddipet:

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులను ,కూలీలను కలిసినందుకు గాను పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ , రాష్ట్రప్రధాన కార్యదర్శి N నారాయణ రావు ,రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్రా పురుషోత్తం, మెదక్ జిల్లా అధ్యక్షులు భూపతి ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చంద్రశేఖర్ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ చర్యను పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే బేషరతుగా విడుదల చేయాలని టిఎస్ సి ఎల్ సి డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను, భావ ప్రకటన స్వేచ్ఛను, పౌర ప్రజాస్వామిక హక్కులను హక్కులను కెసిఆర్ ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేస్తున్నట్టు కమిటీ ఆరోపించింది. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను మానుకోవాలని కోరింది. మేధావులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ నిర్బంధ చర్యలను, అక్రమ అరెస్టులను ఖండించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.