మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయాలి. – డిజీపీ.


పేద్దపల్లి:

ఎప్పటికప్పుడు నక్సల్స్ సమాచారం తెలుసుకుంటూ ఎలాంటి నక్సల్స్ వల్ల ముప్పులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని డిజీపీ
ఆదేశించారు.నక్సల్స్ కదలికలు ఎక్కడ వున్నా, అది మహారాష్ట్ర కాని, రామగుండం కమీషనరేట్ గాని చీమ కదిలిన పోలీస్ కి తెలిసే టెక్నాలజీ ని వాడడం తో పాటుగా, ప్రజలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ప్రజల సహకారంతో పోలీసింగ్ ముందుకు వెళ్తున్నాం అన్నారు . కమీషనరేట్ పరిదిలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్, ప్రతి గ్రామం ఒక ప్రాతిపదికన తీసుకొని గ్రామంలోని ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు అందరు స్వేచ్చగా ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి కావాల్సిన చర్యలు, గురించి చర్చించడం జరిగింది.
కమీషనరేట్ అధికారులు, సిబ్బంది చాల బాగా పని చేస్తున్నారు, జిల్లా పాలనన అధికారుల ఆద్వర్యంలో, CP గారు వారి DCP, ACP, CI, SIలు రెవిన్యూ అదికారులు అందరు ఒక టీం లాగ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమన్వయ పరుచుకుంటూ ఎన్నికలు అనే ఒక మహాయజ్ఞం ను ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సమావేశం రెవ్యూ చేసిన తరువాత ఒక బలమైన నమ్మక కలిగింది. రామగుండం కమీషనరేట్ పరిదిలో అందరు అధికారులు, సిబ్బంది అన్ని రకాల పరిస్థితులకు సిద్దనగా వున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా “ఇన్సిడెంట్ ఫ్రీ” ఎన్నికలు జరుగుతాయి. అనే నమ్మకం రావడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్, ఆదేశాలు నియమాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి వసతులు బడ్జెట్ అవసరాలు, ఫోర్సు ను అందించటం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవ కలెక్టర్ పెద్దపల్లి గారు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమలో డిసిపిలు,ఆడిషినల్ డిసిపిలు ,ఎసిపిలు, సిఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు