మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు.

కొత్తగూడెం:

ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల మండలంలో పోస్టర్లు దర్శనమిచ్చాయి.భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మావోయిస్టులు పాల్పడిన అనేక సంఘటనలను ఉదహరిస్తూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. బీజాపూర్ జిల్లా లో భారీ ఎత్తున మందు పాతరలను గుర్తించిన పోలీసులు. బీజాపూర్ జిల్లా బాషగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో గల లింగగిరి రహదారిపై భద్రతా దళాలను మట్టు పెట్టేందుకు మావోయిస్టులు ఏర్పాటు చేసిన 15 కేజీల ఐఈడి మందుపాతరలను గుర్తించిన కోబ్రా 204, భద్రతా దళాలు. ఈ విషయాన్ని ఎస్పీ మోహిత్ గార్గ్ దృవీకరించారు.