మారియా షరపోవా రిటర్న్స్!!

మాజీ ప్రపంచ నెంబర్ వన్ మారియా షరపోవా తిరిగి టూర్ లోకి ప్రవేశిస్తోంది. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని నాలుగు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఈ రష్యా క్రీడాకారిణి, మల్లోర్కా ఓపెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగుతోంది. ‘మల్లోర్కా ఓపెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగుతున్నానని ప్రకటించేందుకు ఎంతో సంతోషిస్తున్నానని’ షరపోవా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది జనవరిలో డబ్ల్యుటీఏ సెయింట్ పీటర్స్ బర్గ్ లేడీస్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ ను వైదొలగినప్పటి నుంచి ఆమె ఏ టోర్నమెంట్ లో ఆడలేదు. ఫ్రెంచ్ ఓపెన్ సహా క్లే కోర్ట్ సీజన్ కి దూరంగా ఉంది. వింబుల్డన్ కి ముందు జరిగే మల్లోర్కా ఓపెన్ ను గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్ వార్మప్ టోర్నీగా భావిస్తారు. ఈ టోర్నమెంట్ జూన్ 17న ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ డ్రాలో మాజీ వరల్డ్ నెంబర్ వన్ లు విక్టోరియా అజరెంకా, డిఫెండింగ్ వింబుల్డన్ ఛాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ పాల్గొననున్నారు.