మీడియా అకాడమీ భవన నిర్మాణం వేగవంతం

Hyderabad:

మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మన్ అల్లం నారాయణ పరిశీలించారు. కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో మీడియా అకాడమి భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మీడియా అకాడమి భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాలుగు అంతస్తులతో నిర్మించే ఈ భవనం జర్నలిస్టులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నదని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో 300 మందికి సరిపడే సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పనులలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. పనులు నిరంతరం జరగడం పట్ల చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. సురేష్, డి.ఇ. దుర్గా ప్రసాద్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, రహమాన్, నర్రా కన్ స్ట్రక్షన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.