చరిత్ర సృష్టించిన కెప్టెన్ ఆరోహి పండిత్!!

ముంబైకి చెందిన 23 ఏళ్ల కెప్టెన్ ఆరోహి పండిత్ లైట్ స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ఎస్ఏ)లో అట్లాంటిక్ మహాసముద్రం దాటింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె తన యాత్ర పూర్తి చేసిన ఎయిర్ క్రాఫ్ట్ పేరు ‘మాహి’. మాహి ఒక చిన్న సింగిల్ ఇంజన్ సైనస్ 912 విమానం. దీని బరువు 400 కిలోగ్రాములకు కొంచెం ఎక్కువ.

సోమవారం-మంగళవారం తన చిన్న ఎయిర్ క్రాఫ్ట్ తో ఆరోహి 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇకాలుయిట్ విమానాశ్రయంలో దిగింది. ఈ యాత్రలో ఆమె గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్ లలో కూడా ఆగింది. కెప్టెన్ ఆరోహి పండిత్ యాత్రను స్పాన్సర్ చేసిన సోషల్ ఎసెస్ సంస్థ చీఫ్ లియన్ డిసూజా మాట్లాడుతూ ఇది ఆరోహి పండిత్ ఏడాది క్రితం ప్రారంభించిన ప్రపంచ యాత్ర ప్రణాళికలో భాగమని, తన స్నేహితురాలు కేథర్ మిస్క్వెట్లాతో కలిసి జూలై 30న ప్రారంభించినట్టు చెప్పారు. జూలై 30, 2019కి ఆరోహి భారత్ తిరిగి వస్తుందని తెలిపారు.

‘ఈ యాత్రలో ఎల్ఎస్ఏ ద్వారా గ్రీన్ ల్యాండ్ దాటి ఆరోహి తన పేరిట మరొక ప్రపంచ రికార్డ్ సాధించింది. భారత్ తిరిగి వచ్చే లోగా ఆమె మరెన్నో రికార్డులు సొంతం చేసుకోనుందని’ లియన్ డిసూజా వివరించారు. పాకిస్థాన్ లో విమానం ల్యాండ్ చేసిన మొదటి మహిళ అయిన ఆరోహి ఎల్ఎస్ఏ లైసెన్స్ హోల్డర్.

India, National, Sports, Captain Aarohi Pandit, Aarohi Pandit, Atlantic Ocean, LSA, Light Sports Aircraft, Iqaluit Airport, Captain Keithair Misquitta, Keithair Misquitta, Pilot, Aarohi Pandit Flight, Female Pilot, Indian Pilot, WEE, Women Empower Expedition, World’s First Female Pilot to Cross the Atlantic Ocean Solo, Mumbai, Canada, DGCA, Greenland