భారత్ లో 10 ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్

భారత్ లో 10 ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్
microsoft to set up AI Labs in india

సుప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా భారత్ లో ఏఐను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా 10 యూనివర్సిటీల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా బుధవారం ప్రకటించింది. రోజురోజుకీ విస్తరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో 5 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. రాబోయే మూడేళ్లలో 10,000 మంది డెవలపర్ల సాంకేతిక నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దనున్నట్టు చెప్పింది. ‘ఏఐ భారత వ్యాపారాలకు ఊపు తెస్తుందని భావిస్తున్నాం. తద్వారా దేశం మరింత పురోగమిస్తుంది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాలు, ఆరోగ్య రంగం, వ్యవసాయంలో ఎంతో ఉపకరిస్తుందని’ మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి అన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఏఐ 700 మంది వినియోగదారుల డిజిటల్ పరివర్తనకు దోహద పడుతోంది. వీటిలో 60% పెద్ద ఉత్పత్తి పరిశ్రమలు, ఆర్థిక సేవల సంస్థలు ఉన్నాయి.